కమలం పార్టీ వైపు చూస్తున్న డి. శ్రీనివాస్

బిజెపి లోకి డీఎస్ ఫ్యామిలీ నిజామాబాద్ : టిఆర్ఎస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ ఫ్యామిలీ బీజేపీలో చేరుతుందా..? తన ఇద్దరు కొడుకులతో సహా ధర్మపురి శ్రీనివాస్ కమలం పార్టీ లోకి వెళ్తున్నాడా.. ఇప్పుడు ఇదే వార్త నిజామాబాద్ జిల్లాలో కలకలం సృష్టిస్తోంది.

డి.శ్రీనివాస్ .. పరిచయం అవసరం లేని పేరు. కాంగ్రెస్ లో ఉన్నత పదవులు అనుభవించి అధికారంలో వున్న టిఆర్ఎస్ లోకి చేరిన సీనియర్ రాజకీయ నేత. టిఆర్ఎస్ నుంచి త్వరలోనే మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్తారని రావడం.. వాటిని డి. శ్రీనివాస్ ఖండాలుఖండాలుగా ఖండించడం జరిగిపోయాయి. అయితే స్వాత్రంత్ర దినోత్సవం సందర్బంగా డి. శ్రీనివాస్ చిన్న కొడుకు ధర్మపురి అరవింద్ ఈనాడు, హిందు పేపర్లో ఇచ్చిన ఫుల్ పేజీ యాడ్ కలకలం సృష్టిస్తోంది.

దేశమంతా మోడీ వెనకే నడవాలని.. దేశ భక్తి అంటే మోడీ.. మోడీ అంటే దేశ భక్తి అని యాడ్ సారాంశం. టిఆర్ఎస్ లో ఉన్న డీఎస్ ఫామిలీ ..కాంగ్రెస్ వెళ్లనని చెప్పి బిజెపి లోకి వెళ్తున్నమని ఈ యాడ్ ద్వారా చెప్పకనే చెప్పారా అనే సందేహం కలుగుతోంది. నిజామాబాద్ టిఆర్ఎస్ గులాబీ పార్టీ లీడర్లు ఈ యాడ్ పై స్పందించేందుకు కూడా ముందుకు రావడం లేదు. కేసీఆర్ సర్ చూసుకుంటాడాని చెబుతున్నారూ. డి.శ్రీనివాస్ తో సహా ఆయన కుమారులు సంజయ్, అరవింద్ బీజేపీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది.


Leave your comment