కేటిఆర్ గురించి పార్టీ ఎమ్మెల్యేల్లో ఇలాంటి అభిప్రాయ‌ముందా ..!

హైద‌రాబాద్ : తెలంగాణ  ముఖ్య‌మంత్రి కేసిఆర్ కు రాజ‌కీయ వార‌సుడు ఎవ‌రు అంటే ఇంకెవ‌రూ .. కేటిఆర్ అని ట‌క్కున చెప్పేస్తారు టిఆర్ఎస్ నేత‌లు. కేసిఆర్ కూడా అదే త‌ర‌హాలో కేటిఆర్ ను ప్రొజెక్ట్ చేస్తున్నారు కూడా. కాబోయే ముఖ్య‌మంత్రి కేటిఆరే అని ఆయ‌న స‌న్నిహితులు బ‌లంగా బెప్పుకుంటున్నారు కూడా. హ‌రీశ్ రావుకు ఇష్టం ఉన్నా .. లేకున్నా .. కేసిఆర్ త‌న వార‌సుడిగా 2019లో కేటిఆర్ ను సీఎం సీటుపై కూర్చోబెట్ట‌డం ఖాయ‌మ‌నే చ‌ర్చ గులాబీ పార్టీలో బ‌లంగా ఉంది. అయితే ఇంత‌కీ నేత‌లు పైకి కేటిఆర్ ను భ‌విష్య‌త్తు ముఖ్య‌మంత్రిగా చెబుతున్నా .. ఇంట‌ర్న‌ల్ గా కేటిఆర్ గురించి ఏమ‌నుకుంటున్నార‌నేది కొంత ఆస‌క్తి రేపుతోంది.

 

ముఖ్య‌మంత్రిగా కేసిఆర్ త‌ప్పుకొని కేటిఆర్ కు సీఎం సీటు క‌ట్ట‌బెడ‌తార‌నేది అంత ఈజీ కాదంటున్నారు పార్టీలోని కొంద‌రు ఎమ్మెల్యేలు. కేసిఆర్ ఎంపిగా వెళ్ళి డిల్లీ రాజ‌కీయాలు చూస్తార‌నేది కూడా జ‌రిగే ప‌నికాదంటున్నారు. సీఎం సీటు కంటే కేంద్ర మంత్రి ప‌ద‌వి ఏమంత పెద్ద గొప్ప‌కాదు క‌దా .. అలాంట‌ప్పుడు కేసిఆర్ ప‌ద‌విని కొడుకుకు ఎలా క‌ట్ట‌బెడ‌తారు అని ఎమ్మెల్యేల ప్ర‌శ్న‌. ఒక వేళ కేసిఆర్ డిల్లీ వెళ్ళాల్సి వ‌స్తే ప్ర‌ధాని గానో ఉప ప్ర‌ధాని గానో .. థ‌ర్డ్ ఫ్రంట్ చైర్మెన్ హోదానో ఉంటే కానీ వెళ్ళే చాన్స్ లేదంటున్నారు. ఇక అదీ కాక .. తాను త‌ప్పుకొని కొడుకును పీఠ‌మెక్కించేందుకు కేసిఆర్ ఏమీ ములాయం సింగ్ కాదు క‌దా .. మ‌రి అలాంటి త‌ప్పు ఎందుకు చేస్తారు అంటున్నారు. 


ఇక మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఎమ్మెల్యేల నోట్లో నుంచి వ‌చ్చింద‌టే .. కేసిఆర్ త‌ప్పుకొని కేటిఆర్ ను ముఖ్య‌మంత్రి చేస్తే .. కేటిఆర్ ఫెయిల్ అవుతార‌ని చెబుతున్నారు. కేసిఆర్ లో ఉన్నంత రాజ‌కీయ చ‌తుర‌త కేటిఆర్ లో లేద‌నేది స‌ద‌రు ఎమ్మెల్యేల అభిప్రాయం.  ఇక వైపు గులాబీ బాస్ త‌న రాజ‌కీయ వ‌ర‌సుడికి ప‌గ్గాలు క‌ట్ట‌బెట్టేందుకు పూర్తి స్థాయిలో ప్రొజెక్ట్ చేస్తుంటే .. పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం త‌మ అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో ఇలా రివ‌ర్స్ లో అభిప్రాయాలు వ్య‌క్తం చేయ‌డం ఇంట్రెస్టింగ్ పాయింట్ . మ‌రి కేసిఆర్ ఎమ్మెల్యేల మ‌న‌స్సెరిగి న‌డుచుకుంటారో లేక త‌న మ‌న‌స్సులోని నిర్ణ‌యాన్ని అమ‌లు చేస్తారో చూడాలి.


Leave your comment