కాంగ్రెస్ బీసీ అస్త్రం " పొన్నం"

హైద‌రాబాద్ : మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్  కాంగ్రెస్ పార్టీకి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్నారా..? గులాబి బాస్ క్యాస్ట్  పాలిటిక్స్ కు కాంగ్రెస్ .. పొన్నం తో కౌంట‌ర్ ఇవ్వ‌బోతుందా..? బీసీ కార్డ్ కు టిసెంటిమెంట్ ను మిక్స్ చేసి గులాబి ద‌ళ‌ప‌తిని హ‌స్తం పార్టీ ఢీ కొట్ట‌బోతుందా..? అవును నిజ‌మే అంటున్నాయి కాంగ్రెస్ వ‌ర్గాలు. 2019 ఎన్నిక‌లు త‌రుముకొస్తుండ‌టంతో ఇప్ప‌డి నుండే అల‌ర్ట్ అయిన కాంగ్రెస్ ప‌క్కా స్కెఛ్ తో ముందుకెళుతుంది.

ఒక వైపు పార్టీలోని బిసి త‌మ‌కు ప్రాదాన్య‌త క‌ల్పించాల‌ని నేత‌ల స్వ‌రం పెంచ‌డం.. మ‌రోవైపు గులాబి బాస్ తెర‌పైకి తెస్తున్న క్యాస్ట్ పాలిటిక్స్ తో  త‌రుముకొస్తున్న‌ ప్ర‌మాదాన్నిప‌సిగ‌ట్టిన కాంగ్రెస్ పార్టీ.. వేగంగా త‌మ ప్ర‌ణాళిక‌ను లైన్ లో పెట్టేందుకు రెఢీ అయ్యింది. జ‌నాభాలో 50 శాతంకు పైగా ఉన్న బిసీలో 2019లో కీలకంగా మారనుండ‌టంతో కేసీఆర్ .. ఇప్ప‌టికే గొర్లు, బ‌ర్లు, చేప‌లు, ఇలా బీసీ కులాల‌కు వ‌రాలు ప్ర‌క‌టిస్తూ వారిని ప్ర‌స‌న్నం చేసుకుంటున్నారు. దీన్నిగ‌మ‌నించిన కాంగ్రెస్ పార్టీ గులాబి బాస్ ఫ్యూహానికి కౌంట‌ర్ గా కూడా బీసీ కార్డ్ ను విస‌ర‌బోతుంది. ఈ అస్త్రంలో భాగంగానే మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్ ను మ‌రో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా రంగంలోకి దింపేందుకు రెఢీ అయ్యింది.

ప్ర‌స్తుతం పీసీసీ ఛీఫ్ గా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ భ‌ట్టి విక్రమార్క ఉన్నారు. వీరికి అద‌నంగా ఇప్పుడు పొన్నం ప్ర‌భాక‌ర్ ను మ‌రో కొత్త సేనానిగా దీంచాల‌ని కాంగ్రెస్ భావిస్తుంద‌ని సమాచారం. దీనిపై ఇప్ప‌డికే చాలా క‌స‌ర‌త్తు చేసింద‌ట‌. ఈ ప‌ద‌వి కోసం దానం నాగేంద‌ర్, డాక్ట‌ర్ విన‌య్ తో  క‌లుపుకుని ఓ అర‌డ‌జ‌న్ మంది రేస్ లో ఉన్నా రాహుల్ మాత్రం పొన్నం వైపే మొగ్గు చూపుతున్నార‌ని తెలుస్తుంది . అయితే పొన్నం ప్రొఫైల్ కు మిగ‌తా వారు ద‌రిదాపుల్లో లేక పోవ‌డం పొన్నం కు ప్ల‌స్ గా మారింద‌ట‌. 

ఎన్ ఎస్ యూఐ నుండి కాంగ్రెస్ లో ప‌నిచేస్తు వ‌స్తున్న పొన్నం ప్ర‌భాకర్.. ఎంపీగా ఉండి తెలంగాణ విష‌యంలో అదిష్టానంను ఒప్పించ‌డంలో  అలుపెర‌గ‌ని పోరాటం చేయ‌డం., తెలంగాణ బిల్లు పాస్ స‌మ‌యంలో ల‌గ‌డ‌పాటి పిప్ప‌ర్స్ స్ప్రే ను అడ్డుకోవ‌డం, గాయ‌ప‌డ‌టం.. తెలంగాణ‌లో పొన్నంకు ఇమేజ్ ను పెంచింది. ఇప్ప‌డికి కూడా తెలంగాణ విష‌యంలో కేసీఆర్ తో స‌హా.. టిఆర్ఎస్ నేత‌లు ఎవ‌రు కూడా పొన్నం వేలేత్తి చూప‌లేని ప‌రిస్తితి. దీనికి తోడు.. ఏ అంశాన్ని అయినా సూటిగా చెప్ప‌గ‌ల‌గ‌డం.. అందునా టిఆర్ఎస్ కు ప‌ట్టున్న క‌రీంన‌గ‌ర్ చెందిన వ్వ‌క్తి కావ‌డంతో ఉత్త‌ర తెలంగాణ ప్రాధ‌న్య‌త క‌ల్పించిన‌ట్లు అవుతుంద‌న్న‌ది హ‌స్తం పార్టీ భావ‌న‌. వీట‌న్నింటికి తోడు న‌వ‌త‌రం బీసీ నాయ‌కుడు కావ‌డం.. అందులోను బీసీలో బల‌మైన గౌడ సామాజిక వ‌ర్గం నేత గా ఉన్న‌పొన్నం రైట్ ప‌ర్స‌న్ అని రాహుల్ గాంధి భావిస్తున్న‌ట్లు స‌మాచారం. వీటికి తోడు కాంగ్రెస్ అదిష్టానానికి విధేయ‌త కూడా పొన్నంకు క‌లిసివ‌చ్చే అంశంగా నేత‌లు అనుకుంటున్నారు.

ఉత్త‌మ్, భ‌ట్టివిక్ర‌మార్కల‌తో పాటు పొన్నం ను క‌లుపుకుని.. ఓసీ-బీసీ-ఎస్సీ ఫార్ములాతో 2019ఎన్నిక‌ల్లో వెళ్లి గులాబి బాస్ కు చుక్క‌లు చూపించాల‌ని త‌హ త‌హ‌లాడుతుంది హ‌స్తం పార్టీ. ఉత్త‌మ్, భ‌ట్టి విక్ర‌మార్క‌, పొన్నం  ఈముగ్గురికి కూడా ఎలాంటి అవినీతి మ‌ర‌క‌లు లేక పోవ‌డం.. మ‌రో వైపు సామాజీక స‌మ‌తుల్య‌త.. ఇంకోవైపు బీసీ కార్డ్ కాకుండా.. టి సెంటిమెంట్ ట్రంప్ కార్డ్ గా పొన్నంతో ఢీ కొట్టాల‌న్న‌ది కాంగ్రెస్ ఫ్యూహం. మ‌రీ ఈ ప్లాన్స్ ఎంత వ‌ర‌కు కాంగ్రెస్ ల‌కు వ‌ర్కౌట్ అవుతాయో చూడాలి.


Leave your comment