కలిచివేస్తున్న చిన్నారి సూసైడ్ లెటర్

కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అభంశుభం తెలియని 11 ఏళ్ల చిన్నారి ఆత్మహత్య చేసుకుంది.నిజాంసాగర్ మండల కేంద్రంలో బ్లూ బెల్స్ హై స్కూల్ లో ఆరో తరగతి చదివే విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. చిన్నారి రాసిన సూసైడ్ లెటర్ హృదయాన్ని పిండేస్తోంది.

 

రేపటిరకు హోంవర్క్ పూర్తి చేయకుంటే ప్రిన్సిపల్‌ వద్దకు తీసుకెళ్తానని సోషల్ టీచర్ అన్నాడు. ఇంట్లో వాల్లు కూడా నన్ను అనవసరంగా తిడుతున్నారు అందుకే చనిపోతున్నాను అని లేఖలో పేర్కొంది. ఈ సంఘటన బుధవారం జరిగిననా అలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలిసి తెలియని 11 సంవత్సరాల్లో చిన్నారి ఆత్మహత్య చేసుకోవటం అందర్ని కలిచివేసింది.


Leave your comment