విధ్యార్ధుల చావుకు కేసీఆర్ సర్కార్ దే బాధ్యత

news02 May 2, 2019, 9:32 p.m. political

uttam

అమాయకులైన విధ్యార్ధుల చావుకు కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇంటర్ ఫలితాల అవకతవకల నేపధ్యంలో మనస్థానం చెంది ఆత్మహత్య చేసుకున్న విధ్యార్ధుల ఆత్మకు శాంతి చేకూరాలని హుజూర్ నగర్ లో నిర్వహించిన శాంతి ర్యాలీలో ఉత్తమ్ పాల్గొన్నారు. క్యాండిల్స్ తో నిర్వహించిన ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే అభం శుభం తెలియని విధ్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారని ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఈ ఘటనకు భాద్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేసి.. విధ్యా శాఖ మంత్రిని భర్తరఫ్ చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. మరోవైపు ఆత్మహత్య చేసుకున్న విధ్యార్ధుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన చెప్పారు. 

uttam

tags: uttam, pcc chief uttam, uttam candle rally, uttam participate in candle rally, uttam candle rally in huzurnagar,

Related Post