ప్రధాని మోదీ ఒక రోజు నిరసన..

news02 April 10, 2018, 8:55 p.m. political

pm modi agitation

న్యూ డిల్లీ- ఇటీవల జరిగిన పార్లమెంట్‌ సమావశాల్లో విపక్షాల తీరుపై ప్రధాని నేరంద్ర మోదీ మనస్తాపం చెందారు. విపక్షాల తీరుకు నిరసనగా ఒక రోజు దీక్ష చేయాలని మోదీ నిర్ణయించారు. బీజేపీ ఎంపీలతో కలిసి ఈనెల 12న మోదీ నిరాహార దీక్ష చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాసేపటి క్రితం బీజేేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జరిగిన తీరుపై మోదీ, అమిత్‌ షా సమీక్షించారు. 

ఇక విపక్షాల తీరుకు నిరసనగా దీక్ష చేయాలని ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ తప్పుబట్టింది. పార్లమెంట్‌ ముగిసిన వారం రోజుల తర్వాత ప్రధాని నిద్రలేచారంటూ కాంగ్రెస్‌ విమర్శలు గుప్పిస్తోంది. ఏఐఏడీఎంకేతో పాటు వివిధ పక్షాల ఆందోళనలతో రెండో విడత బడ్జెట్‌ సమావేశాల్లో 23 రోజుల పాటు సభా కార్యకలాపాలు స్తంభించాయి. తెలుగుదేశం, వైసీపి, కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులపై చర్చ జరగకుండా అడ్డుకునేందుకే ఏఐఏడీఎంకే ఎంపీలతో కేంద్రప్రభుత్వమే ఆందోళన చేయించిందని విపక్షాలు ఆరోపించాయి. విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలా నిరసన కార్యక్రమం చేపట్టిందని తెలుస్తోంది.

tags: pm, pm modi, modi on parliament, modi agitation, modi one day agitation

Related Post