దేశాన్ని భ్రష్టు పట్టించారు

news02 Jan. 7, 2019, 7:52 a.m. political

babu

రాష్ట్రాలపై బీజేపీ సర్కార్ పెత్తనాన్ని సహించేది లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. ప్రధానిగా నరేంద్ర  మోదీ అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. మోదీ ఏపీ ప్రజలను నమ్మించి మోసం చేశారని చంద్రబాబు ఆరోపించారు. విభజన హామీలను నెరవేర్చకుండా ప్రధాని మోదీ ఏపీపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని పునాదిపాడులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఉద్యోగకల్పన, ధరల నియంత్రణతో పాటు పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ తదితర అంశాల్లో ప్రధాని మోదీ విఫలమయ్యారని ముఖ్యమంత్రి విమర్శించారు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకే ప్రశ్నించిన తమవంటి వారిపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో దుష్ట రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని బీజేపీ నేతలపై చంద్రబాబు మండిపడ్డారు. పపవిత్ర శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు భిన్నంగా బీజేపీ పనిచేస్తోందని సీఎం అన్నారు. 

babu

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యూపీలో అఖిలేష్‌ యాదవ్‌, మాయావతి సీట్లను సర్దుబాటు చేసుకున్నారని..  అది జీర్ణించుకోలేని మోదీ వెంటనే అఖిలేష్‌పై పాత అభియోగాలను తిరగదోడి సీబీఐ కేసులు పెట్టించి కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. మరోవైపు వైఎస్ జగన్‌కు సానుభూతి వస్తుందని ఆయన అభిమాని కోడికత్తితో దాడి చేస్తే ఈ నేరాన్ని తనపైకి  నెట్టడం ఎంతవరకు సమంజసమని సీఎం ప్రశ్నించారు. ఈ కేసును ఎన్‌ఐఏ కు అప్పగించడం ద్వారా బీజేపీ, వైసీపీ సంబంధాలు బయటపడ్డాయని చంద్రబాబు ఆరోపించారు. శాంతిభద్రతల అంశం రాష్ట్రాల పరిధిలోకి వస్తుందన్న ముఖ్యమంత్రి.. దీన్ని ఉల్లంఘించి రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ, అమిత్‌షాలు దేశాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించారని ఫైర్ అయ్యారు. హోదా, ఇతర అంశాలపై పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీసినందుకే టీడీపీ ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్‌ చేశారని ఆరోపించిన చంద్రబాబు... రాష్ట్రంనుంచి పెద్ద ఎత్తున వెళ్లి దిల్లీ నడివీధుల్లో నినదిస్తే అరెస్టు చేశారని చెప్పారు. జగన్‌, మోదీ, కేసీఆర్‌లు ఏపీ రాష్ట్రంపై పడ్డారని.. ఏపీని భ్రష్టు పట్టించాలని ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.  

tags: babu, cm babu, cm chandra babu, babu fire on modi, cm chandra babu fire on pm modi, chandra babu fire on modi

Related Post