మేము చెప్పే ప్ర‌తి మాట నిల‌బెట్టుకుంటాం..

news02 Aug. 19, 2018, 8:04 p.m. political

 

Uttam Kumar Reddy Fires on cm KCR

హైదరాబాద్ : కేసీఆర్ ప్రభుత్వంపై పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఫేస్ బుక్ లైవ్‌లో పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన ఉత్త‌మ్‌... కాంగ్రెస్ అధికారంలోకి వస్తె అమలు చేసే పథకాలను వివరించారు. 2014లో రాజ‌కీయంగా త్యాగాలు చేసి కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ ఇస్తే  కేసిఆర్ అబద్ద‌పు హామీలు, బూట‌క‌పు మాట‌లు చెప్పిఅధికారంలోకి వ‌చ్చాడ‌ని, నాలుగున్న‌ర ఏళ్ళు గ‌డుస్తున్నాఏఒక్క హామీ  అమ‌లుచేయ‌లేద‌ని విమ‌ర్శించారు  ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. 

కేంద్రంలో బిజెపి ప్ర‌భుత్వం రాఫెల్ యుద్ద విమానాల కుంభ‌కోణంలో 40 వేల కోట్లకు పైగా అక్ర‌మాల‌కు పాల్ప‌డింద‌ని, వైమానిక విమానాల అవినీతిలో ఇదే పెద్ద కుంభ‌కోణ‌మ‌ని అన్నారు ఉత్త‌మ్. అనిల్ అంబానికి ఈ కాంట్రాక్టు క‌ట్ట‌బెట్టి మోడీ దేశాన్ని తాక‌ట్టు పెట్టార‌ని విమ‌ర్శించారు. రాఫెల్ కుంబ‌కోణంపై మోడిని వ‌దిలేది లేద‌న్న ఉత్త‌మ్, రాఫెల్ అవీనితీని ప్ర‌తి కార్య‌క‌ర్త‌ ఉద్య‌మంగాప్ర‌జ‌ల్లోకి తీసుకుపోవాల‌ని పిలుపునిచ్చారు.

ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో వంద ప‌డ‌క‌ల ఆసుప్ర‌తి ప్ర‌తి జిల్లా కేంద్రంలో సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి.,కేజీ టు పిజి ఉచిత నిర్బంధ విద్య, నియోజ‌క‌వ‌ర్గానికి ల‌క్ష ఎక‌రాల‌కు చొప్ప‌న కోటి ఎక‌రాల‌కు సాగునీరు,  అర్హులైన ప్ర‌తి ద‌ళిత, గిరిజ‌న కుటుంబానికి మూడు ఎక‌రాల భూమి, అర్హులైన అంద‌రికీ డ‌బుల్ బెడ్‌రూమ్, ముస్లీంల‌కు, గిరిజ‌నుల‌కు 12 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇలా కేసీఆర్ ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు ఎటు పోయాయ‌ని ప్ర‌శ్నించారు కెప్టెన్ ఉత్త‌మ్.

కాంగ్రెస్‌పార్టీ టిఆర్ఎస్ లాగా కాద‌ని.. హామీలు ఇస్తే నెరవేర్చి తీరుతుంద‌ని అన్నారు ఉత్త‌మ్. గ‌తంలో ఉచిత విద్యుత్‌, బ‌కాయిల ర‌ద్దు, రుణ మాఫీ లాంటి అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వాటిని ప‌క్కాగా అమ‌లు చేసిన సంగ‌తిని గుర్తుచేశారు. ఇప్ప‌డు కాంగ్రెస్  ఇస్తున్న ప్ర‌తి హామీని అమ‌లు చేసి చూపుతామ‌న్న ఉత్త‌మ్ , ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకునే స‌త్తా  ఉన్న పార్టీ కాంగ్రెస్ అన్నారు.

ల‌క్ష‌లరూపాయ‌ల రుణ మాఫీ ఏక‌కాలంలో చేసి తీరుతామ‌న్న ఉత్త‌మ్.  సామాజిక పెన్ష‌న్ల న‌గ‌దును రెట్టింపు చేస్తామ‌ని అన్నారు. వృద్దులు, వితంత‌వులు, ఒంట‌రి మ‌హిళ‌లు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడి కార్మికుల‌కు ప్ర‌స్తుతం ఉన్న వెయ్యి రూపాయ‌ల పెన్ష‌న్‌ను, రెండు వేల చేస్తామ‌ని, విక‌లాంగుల‌కు ఇప్పుడున్న 1500 పెన్ష‌న్ 3 వేల రూపాయ‌లు చేస్తామ‌ని ఆయ‌న వివ‌రించారు. అలాగే వృద్దాప్య పెన్ష‌న్ వ‌యో ప‌రిమితిని 65 నుంచి 58 ఏళ్ళ వ‌య‌స్సుకు త‌గ్గిస్తామ‌న్న ఆయ‌న‌. దాదాపు 40 ల‌క్ష‌ల మంది పెన్ష‌న్ల‌ర్ల‌కు ల‌బ్డి జ‌రిగే ఈ విష‌యాల‌ను కార్య‌క‌ర్త‌లు విరివిగా ప్ర‌జ‌ల‌లోకి తీసుకెళ్లాల‌ని సూచించారు.  రాష్ట్రంలో నేటికి ఉద్యోగాలు రాకుండా యువ‌త నిరాశ‌, నిస్తౄహ‌లో ఉన్నార‌ని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వెంట‌నే ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని ఉద్యోగాలు రాకుండా ఉన్న యువ‌త‌కు  3 వేల రూపాయ‌లు భృతి ఇస్తామ‌ని తెలిపారు. నిరుధ్యోగ భృతి సాధ్యం కాద‌ని కేసీఆర్ గాఇ మాట‌లు మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డ పీసీసీ ఛీఫ్...ఆంధ్రా కాంట్రాక్ట‌ర్ల‌కు ఇవ్వ‌డానికి మాత్రం నిధులున్నాయ‌ని ఎద్దేవాచేశారు. 2019నాటికి రాష్ట్ర బ‌డ్జెట్ రెండు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు దాటుతుంద‌ని అప్ప‌డు నెల‌కు 300 కోట్ల రూపాయ‌లు ఇవ్వ‌డానికి ఎలాంటి స‌మ‌స్య ఉండ‌ద‌ని, రాబోయేది కాంగ్రెస్ ప్ర‌భుత్వంమేన్నారు.

అలాగే రాష్ట్రంలో రైతులు తీవ్రంగా క‌ష్ట న‌ష్టాలు ప‌డుతున్నార‌ని, అప్ప‌లు బాధ‌ల‌తో వారు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నా కేసిఆర్ లో చ‌ల‌నం లేద‌ని, వారికి గిట్టుబాటు ధ‌ర‌లు ఇవ్వ‌డంలో కేసిఆర్ ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మ‌యింద‌ని విమ‌ర్శించారు ఉత్త‌మ్. కాంగ్రెస్ ప్ర‌భుత్వం రాగానే వ్య‌వ‌సాయాన్ని పండుగ చేసి రైతుల క‌ళ్ళ‌లో ఆనందం చూస్తామ‌ని అన్నారు. 17 ర‌కాల వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌కు గిట్టు బాటు ధ‌ర‌లు క‌ల్పిస్తామ‌ని 5 వేల కోట్ల రూపాయ‌లు మార్కెట్ స్థీరిక‌ర‌ణ నిధుల‌ను ఏర్పాటు చేసి రైతుల‌కు వ్యవ‌సాయం లాభ‌దాయ‌కంగా చేస్తామ‌ని, వ‌రి, మొక్క‌జొన్న‌ల‌కు క్వింటాళ్‌కు రెండు వేలు, ప‌త్తికి 6 వేలు, మిర్చికి 10 వేల రూపాయ‌ల‌కు త‌క్కువ కాకుండా చూస్తామ‌ని వివ‌రించారు. అలాగే ప్ర‌కృతి వైప‌రిత్యాలు వచ్చిన‌పుడు రైతుల‌కు ఎలాంటి న‌ష్టం రాకుండా అద్బుతమైన వ్యవ‌సాయ భీమా ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తామ‌ని వివ‌రించారు. 

మ‌హిళ‌ల విష‌యంలో కేసిఆర్ ప్ర‌భుత్వం అవ‌మానిస్తుంద‌ని ఆరోపించారు ఉత్త‌మ్.  రాహుల్ గాంధీ ఇక్క‌డి కొచ్చి మ‌హిళా సంఘాల‌తో స‌మావేశ‌మ‌య్యార‌ని కానీ కేసిఆర్‌కు మ‌హిళ‌ల‌తో స‌మావేశం కావ‌డానికి స‌మ‌యం లేద‌ని విమ‌ర్శించారు. మ‌హిళ‌ల‌ 3 వేల కోట్ల బ‌కాయిలపై  రాహుల్ గాంధీ ప్ర‌శ్నించగానే..కేసీఆర్ హ‌డావిడిగా 970 కోట్ల రూపాయ‌లు విడుదల చేశార‌ని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 ల‌క్ష‌ల మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌కు సంఘానికి ల‌క్ష రూపాయ‌ల చొప్పున ఉచితంగా అంద‌జేస్తామ‌న్న ఆయ‌న‌. ప్ర‌తి సంఘానికి 10 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌డ్డీ లేని కుండా అంద‌చేస్తామ‌ని తెలిపారు. అభ‌య హ‌స్తం పెన్ష‌న్ల‌ను పున‌రుద్ద‌రించి వాటిని 500 నుంచి వెయ్యి రూపాయ‌లు చేస్తామ‌ని సెర్ప్ వ‌ర్క‌ర్ల‌కు ఉద్యోగాల‌ను ప‌ర్మ‌నెంట్ చేస్తామ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. 

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు డిసెంబ‌ర్ లో వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌తి కార్య‌క‌ర్తా సిద్దంగా ఉండాల‌ని  పిలుపునిచ్చారు. తెలంగాణ‌లో రాహుల్ గాంధీ టూర్ గ్రాండ్ స‌క్సెస్ అయ్యింద‌ని.., దీంతో కార్య‌క‌ర్త‌ల క‌ష్టం ఫ‌లించింద‌ని అన్నారు. త్వ‌ర‌లో ప్ర‌జా చైత‌న్య యాత్ర మొద‌లౌవుతుంద‌న్న ఉత్త‌మ్., త్వ‌ర‌లోనే ఇంటింటికి కాంగ్రెస్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తామ‌ని తెలిపారు. 

రాష్ట్రంలోకేసిఆర్ ఒక దుర్మార్గ‌మైన పాల‌న సాగిస్తున్నార‌ని, ప్ర‌శ్నిస్తే జైల్లో పెడుతామ‌ని బెదిరిస్తున్నార‌ని విమ‌ర్శించారు ఉత్త‌మ్. కేసిఆర్‌, కేటిఆర్‌లు అదికార మ‌దంతో..  సోనియాపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు ఉత్త‌మ్. కేటిఆర్ అధికారాన్నిఅడ్డుపెట్టుకుని  వేల కోట్ల రూపాయ‌లు సంపాదించి క‌ళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్న వారికి.,  ప్ర‌జా జీవితంలో బ‌తికే అర్హ‌త లేద‌ని అన్నారు. 

tags: Uttam Kumar Reddy, PCC chief, Rahul Gandhi, shakthi app, CM KCR, kcr family, Uttam hard comments

Related Post