డేటా దొంగిలించి మాపైనే కేసులా

news02 March 7, 2019, 7:41 p.m. political

babu

టీడీపీ పార్టీకి సంబందించిన డేటాను దొంగతనం చేసి.. మళ్లీ తమపైనే కేసు పడతారా అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. గత 20 సంవత్సరాలుగా టీడీపీ సమాచారాన్ని కంప్యూటరైజ్‌ చేస్తే ఆ సమాచారం దొంగిలించడమే కాకుండా.. మా ప్రభుత్వంపైనే కేసు పెడతారా అని ఆయన మండిపడ్డారు. మరో వైపు ఫారం-7 పెట్టి ఓట్లను తొలగించడంపైనా చంద్రబాబు ఫైర్ అయ్యారు. కార్యకర్తలు డేటా సేకరిస్తే తప్పు ఏంటని ప్రశ్నించిన ముఖ్యమంత్రి.. ఒక ప్రైవేటు కంపెనీ డేటాను ఏ చట్ట ప్రకారం తీసుకుంటారని నిలదీశారు. తమ తమ ఓట్లను చెక్‌ చేసుకోవాలని ప్రతి కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తున్నామన్న చంద్రబాబు.. ఈ అరాచక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైసీపీ అధినేత జగన్‌కు హైదరాబాద్‌లో టీఆర్ ఎస్ ప్రభుత్వం సహకరిస్తోందన్న ఆయన.. అక్కడి ఆర్థిక మూలాలను ఉపయోగించుకొని కేసులు పెడతున్నారని ఆరోపించారు. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలు ఆర్థిక ఉగ్రవాదుల్లా పనిచేస్తున్నాయని.. ఇటువంటి దాడులపై పోరాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

tags: babu, chandra babu, chandra babu fire on kcr, chandra babu fire on jagan, chandra babu about data theaft case, cm chandra babu fire on data theaft case

Related Post