సపాయి పారిశుద్ధ్య కార్మికుల జీతాల కోసం గ్రామ పరిధిలో భిక్షాటన

news02 April 21, 2019, 11:36 a.m. political

Sarpanch protest on kcr governament

రాజన్న సిరిసిల్ల జిల్లా : మూనెళ్ళ క్రితం సర్పంచ్ గా గెలిచిన ఒక యువకుడు ప్రభుత్వం పై వింత నిరసనకు దిగాడు. కాకపోతే ఈ సమస్య ఒక సర్పంచ్ ది కాదు తెలంగాణ లోని అన్ని గ్రామాల సర్పంచ్ లది. రాజన్న సిరిసిల్ల జిల్లా లో ని గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ ప్రభుత్వం పై తనదైన శైలిలో ప్రభుత్వం పై నిరసన తెలియజేశారు.

వారిగ్రామపంచాయతీ సపాయి పారిశుద్ధ్య కార్మికుల జీతాల కోసం గ్రామ పరిధిలో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. వారి జీతాల కోసం కావలసిన మొత్తాన్ని గ్రామస్థుల నుండి భిక్షాటన ద్వారా సేకరించే ప్రయత్నం చేశారు... ఈ సందర్భంగా గ్రామపంచాయతీ సర్పంచ్ గా గెలిచి నాలుగు మాసాలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చెక్ పవర్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణ చేశారు.. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలుగా మార్చే ప్రయత్నం చేస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేసినప్పటికీ అధికారులు తమ పరిధిలో మాత్రం చెక్ పవర్ లేదన్నారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయులు సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు ఈ నియోజకవర్గం శాసనసభ్యుడు కావడం కొసమెరుపు..

tags: Telangana surpanches, surpanches protest on kcr, Telangana cm, cm kcr family, cm kcr phone number, Ktr constency, mla Ktr family, minister Ktr, cm Ktr life, Ktr wife family.

Related Post