కేసీఆర్ సర్కార్ పై కోర్టు సీరియస్..

news02 Oct. 11, 2018, 6:55 p.m. political

kcr

తెలంగాణ సర్కార్ కు మరోసారి చక్కెదురైంది. హైకోర్టు కేసీఆర్ సర్కార్ కు మళ్లీ అక్షింతలు వేసింది. తెలంగాణలో పంచాయితీల్లో స్పెషల్ ఆపీసర్లను నియమించిన తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. పంచాయితీల్లో స్పెషల్ ఆపీసర్ల నియామకం రాజ్యాంగ విరుద్దమని హైకోర్టు ఘాటుగా స్పందించింది. తెలంగాణలో జులై 31తో పంచాయితీల గడువు ముగిసినా.. ఎన్నికలు నిర్వహించకుండా.. స్పెషల్ ఆపీసర్లను నియమించింది తెలంగాణ సర్కార్. దీన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు పిటీషన్లు దాఖలు అయ్యాయి. వీటిని విచారించిన కోర్టు కేసీఆర్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యాంగ విరుద్దంగా పంచాయితీల్లో స్పెషల్ ఆఫీసర్లను ఎలా నియమిస్తారని కోర్టు ప్రశ్నించింది. 

kcr
పంచాయితీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మూడు నెలల్లో ఈ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను  ఆలోపే పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. తెలంగాణలో టీఆర్ ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత కారణంగా ఇప్పటికిప్పుడు పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి ఖాయమని భావించిన కేసీఆర్.. పంచాయితీ ఎన్నికలను వాయిదా వేసి.. స్పెషల్ ఆపీసర్లను నియమించిన సంగతి తెలిసిందే. 
 

tags: hi court, hi court fire on kcr, hi court fire on kcr govt, hi court on panchayati elections, hi court about sarpanch elections, hi court serious on sarpanch elections

Related Post