లోక‌ల్ ఎమ్మెల్సీ పోరుపై కాంగ్రెస్ లీగ‌ల్ పైట్

news02 May 12, 2019, 4:56 p.m. political

tpcc_pittistion__in_suprime_court, mptc, zptc elections

హైద‌రాబాద్ : వ‌రంగ‌ల్ ,న‌ల్గొండ‌, రంగారెడ్డి  లోక‌ల్ బాడి ఎల‌క్ష‌న్లపై సుప్రిం బాట ప‌ట్టాల‌ని డిసైడ్ అయ్యింది తెలంగాణ కాంగ్రెస్. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్తి అయ్యాక‌.. కొత్త ఓట‌ర్ల జాబితా ప్ర‌క‌టించిన త‌ర్వాత‌నే.. ఈ మూడు ఎమ్మెల్సీల‌కు ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని అంటున్న కాంగ్రెస్ పార్టీ..  ఈసీ పాత ఎంపీటీసీ, జ‌డ్పీటీసీల‌తో ఈ ఎన్నిక‌ల‌ను పూర్తి చేయాల‌ని ప్ర‌క‌టించ‌డాన్నితీవ్రంగా త‌ప్పుప‌డుతుంది. గ‌తంలో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీలుగా ప‌నిచేసిన వారిలో చాలామంది.. మొన్న‌టి స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో పోటీచేసి రాజీనామా చేయ‌గా, మ‌రి కొంద‌రు వివిధ‌ కార‌ణాల‌తో ఆ ప‌ద‌వుల‌ను కోల్పోయార‌ని.. ఈప‌రిస్తితుల్లో పాత వారితో ఎన్నిక‌లు ఎలా నిర్వ‌హిస్తారని ప్ర‌శ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ. 

uttham_meeting_on_local_body_lections, gandhibhavan

ప్ర‌ధాన ప్ర‌తిక్షంగా తాము  చేసిన పిర్యాదుల‌ను ప‌ట్టించుకోకుండా.. ఈసీ అదికార పార్టీకి వ‌త్తాసు ప‌లుకుంద‌ని అంటున్న టికాంగ్రెస్.. ఈసీ వ్య‌వ‌హారాన్ని ఏకంగా సుప్రిం కోర్టులో తేల్చుకోవాల‌ని నిర్ణ‌యించింది.కొత్త ఓటర్ల జాబితా సిద్ధం చేశాకనే ఎన్నికలు నిర్వహించేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయించాలనే నిర్ణయానికి వచ్చింది టికాంగ్రెస్. గాందిభ‌వ‌న్ .. పీసీసీ ఛీప్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అధ్య‌క్ష్య‌త‌న జ‌రిగిన ముఖ్య నేత‌ల స‌మావేశంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై చ‌ర్చించారు. ఇప్ప‌డికే కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ల‌తో ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని ఉత్త‌మ్ ఈసీ కి విజ్ణ‌ప్తి చేసిన సంగ‌తి తెలిసిందే. ఈసీ వ్య‌వ‌హార శైళీపై ఆగ్ర‌హంగా ఉంది కాంగ్రెస్. ఇక ఎమ్మెల్సీ ఎన్నిక‌ల జ‌రుగ‌తున్న‌వ‌రంగ‌ల్ , న‌ల్గొండ‌, రంగారెడ్డి జిల్లాల నుండి ఇద్ద‌రేసి జ‌డ్పీటీసీ, ఎంపీటీసీల‌తో విడివిడిగా పిటీష‌న్ లు వేయాలని పీసీసీ ఛీఫ్  ఉత్త‌మ్ నిర్ణ‌యించారు. అప్ప‌డికి కోర్ట్ కు సానుకూలంగా స్పందించ‌క‌పోతే.. 14 న వారితో నామినేష‌న్ లు వేయిస్తామ‌ని ఉత్త‌మ్ తెలిపారు. ఇక ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఎంపిక‌ను డిసీసీ అధ్య‌క్షుల‌కు అప్ప‌గించింది టిపిసిసి.


 

tags: tpcc, uttham kumar reddy, local body mlc elections, suprim court, election commission, cm kcr, ts governament,

Related Post