కేసీఆర్ ను దోషిగా నిలబెట్టేందుకు లైవ్ కెమెరాలు సిద్ధం చేసిన కాంగ్రెస్

news02 March 3, 2019, 10:36 p.m. political

Telangana Congress leaders protest

హైదరాబాద్ : తమ పార్టీ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లో చేర్చుకోవడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు . గత ప్రభుత్వంలో లాగానే ఇప్పుడు కూడా కేసీఆర్ ఇతర పార్టీ ల ఎమ్మెల్యేలను చేర్చుకోవటం పై కన్నెర్ర చేస్తున్నారు. అసెంబ్లీ లో గాంధీ విగ్రహం ముందు నల్ల రిబ్బన్ లతో నిరసన తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యే లు .. మూడు రోజుల పాటు నిరసనలు తెలిపి సీఎం కేసీఆర్ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చేందుకు ప్లాన్ చేశారు. వివిధ ప్రాజెక్ట్ ల డిజైన్ మార్పు అంశం సందర్భంగా అసెంబ్లీ లో జరిగిన చర్చలు శబరి నది గోదావరిలో ఎక్కడ కలుస్తుందనే విషయం పై సీఎం కేసీఆర్.. సిఎల్పీ నేత భట్టి విక్రమార్క కు మధ్య మాటల యుద్దం నడిచింది. దీంతో రెండు రోజుల పాటు వివిధ ప్రాజెక్టుల వద్దకు మీడియా ను తీసుకెళ్లేందుకు ప్లాన్ చేశారు.

Telangana Congress leaders protest

 

ఎమ్మెల్యే రేగ కాంతారావు టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకోవటం తో ఆ నియోజక వర్గంలో ఈ నెల 8 వ తేదీన నిరసన కార్యక్రమాలు ప్లాన్ చేశారు. రేగ కాంత రావు టీఆర్ఎస్ కు అమ్ముడు పోయాడని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ముఖ్య నేతలు ఆ నియోజక వర్గంలో ప్రజల మద్దతు లేకుండా చేయాలని భావిస్తున్నారు. 9,10 తేదీల్లో ఖమ్మం జిల్లా లోని ఇందిరా సాగర్ ప్రాజెక్ట్, రుద్రమ కోట మరియు గోదావరిలో శబరి నదీ సంగమం జరిగే ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. మీడియా ను కూడా ప్రాజెక్టుల పరిశీలనకు తీసుకెళ్తున్నారు. 

ఖమ్మంజిల్లా రుద్రమకోట దగ్గర శబరి నదిలో ఏడాదంతా అందుబాటులో ఉండే 4.5 టీఎంసీల నీటిని ఉపయోగించి..దుమ్ముగూడెం, సీతారామప్రాజెక్టుల ద్వారా 2.5లక్షల నుంచి 8లక్షల ఎకరాల దాకా నీరు ఇవ్వొచ్చునన్నారు. దీంతో శబరి నది ఎక్కడుంది అనే అంశంపై సీఎం కేసీఆర్ . భట్టి విక్రమార్క ల మధ్య సభలో మాటల యుద్దం జరిగింది. రుద్రమకోట, శబరి నది ఎక్కడ ఉంది.. ఈ విషయంలో సభను తప్పుదోవ పట్టిస్తారా అని విమర్శించారు. శబరినది గోదావరిలో కలిసే స్థానం ఏపీలో ఉందని.. భౌగోళిక వాస్తవాలు తెలుసుకోకుండా ఎలా మాట్లాడతారని సీఎం ప్రశ్నించారు. పాపికొండల దగ్గర శబరి కలుస్తుందన్నారు. మరోసారి ధ్రువీకరించుకోవాలని భట్టికి సూచించారు. దీంతో మీడియా ను కూడా స్పాట్ కు తీసుకెళ్లి కేసీఆర్ వాదన ను తప్పని రుజువు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

tags: Utham Kumar reddy, Pcc chief, Telangana Congress president, Rahul Gandhi, Rahul Gandhi direction, Sonia Gandhi, revantth reddy, Lok Sabha elections, Telangana loksabha constencies, Telangana election results, cm kcr, Rahul Gandhi contact numbers , Rahul Gandhi address, aicc president, Gandhi statue, TS Cong leaders protest.

Related Post