కూటమిగానే ఎన్నికలకు వెళ్తాం..

news02 Nov. 5, 2018, 8:46 p.m. political

uttam

మహాకూటమి నుంచి ఏ పార్టీ బయటకు వెళ్ళదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కూటమిగానే ఎన్నికలకు వెళతామని ఆయన చెప్పారు. హైదరాబాద్ లోని ఓ హోటల్ లో మహాకూటమి లోని పార్టీల నేతలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈమేరకు సీట్ల పంపకాలపై సుధీర్గంగా చర్చించారు. తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం తో చర్చలు ఫల ప్రదంగా జరిగాయని ఉత్తమ్ తెలిపారు. సమావేశం నుంచి కోదండరాం మధ్యలోనే వెళ్లిపోయారన్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన చెప్పారు. సీట్ల పంపకాలపై చర్చలు ముగిసిన తరువాతే కోదండరాం వెళ్లిపోయారని ఆయన తెలిపారు. 

uttam

ఇక తెలంగాణ జన సమితి , సీపీఐ పార్టీల సీట్ల పై మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి కొట్టిపారేశారు. మహాకూటమి సీట్ల పంపకాలపై త్వరలోనే క్లారిటీ వస్తుందని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డితో కూడా చర్చలు కొనసాగుతున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో మంగళవారం జరగనున్న స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు హస్తినకు వెళ్లనున్నట్లు చెప్పిన పీసిసి చీఫ్.. ఒకటి రెండు రోజుల్లో మహాకూటమి సీట్లపై పూర్తి స్పష్టత వస్తుందని.. అందులో ఎటువంటి సందేహం లేదని తేల్చి చెప్పారు.

 

tags: mahakutami, uttam on mahakutami, uttam about mahakutami, uttam about mahakutami seats, uttam kumar reddy about mahakutami, uttam comments on mahakutami

Related Post