తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారు

news02 March 5, 2019, 10:15 p.m. political

Utham Kumar Reddy visit Rahul Gandhi meeting place at chevella constency

హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల శంఖారావం మోగించెందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. మెజార్టీ లోక్ సభ సీట్లు కైవసం చేసుకునేందుకు నేతలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. పార్టీ క్యాడర్ లో ఎన్నికల వేడి రగిలించెందుకు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. చేవెళ్ల నియోజకవర్గం లో ఈనెల 9న జరిగే ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నారు. 

Rahul Gandhi visit Telangana

పార్టీ బూతు స్థాయి నేతలతో సహా కార్యకర్తలు, సామాన్య ప్రజలు మొత్తం రెండు లక్షల మంది ఈ సభకు హాజరు అవుతున్నట్లు నేతలు చెబుతున్నారు. ఇప్పటికే రాహుల్ సభ కు మహేశ్వరం నియోజకవర్గం లోని పహడి షరీఫ్ సమీపం లో ఉత్తమ్ కుమార్ రెడ్డి బృందం సభ స్థల పరిశీలన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వున్న జిల్లా ల నుంచి కార్యకర్తలు ఈ సభకు తరలి రానున్నారు. ఈ వేదిక పై నుంచి లోక్ సభ ఎన్నికల గురించి రాహుల్ గాంధీ దిశా నిర్దేశం చేయబోతున్నారు. దేశం లో జరిగే లోక్ సభ ఎన్నికలు .. రాహుల్ గాంధీ, మోడీ ల మధ్యనే అని కాంగ్రెస్ నేతలు గట్టిగా వాదిస్తున్నారు. రాష్ట్రంలో జరిగే లోక్ సభ ఎన్నికలు కేసీఆర్ కు ఎలాంటి సంబంధం వుండదని అంటున్నారు. 

Utham Kumar Reddy visit chevella constency

కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కనీస ఆదాయ పథకం ప్రకటనకు తెలంగాణ వేదిక కాబోతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకుంటోంది. దేశం లోని ప్రతి పౌరునికి కనీస ఆదాయం వచ్చే విధంగా కాంగ్రెస్ సరికొత్త పథకాన్ని సిద్ధం చేసింది. ఈ స్కీమ్ ను ఇక్కడినుంచే రాహుల్ గాంధీ ప్రకటించ బోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయబోతోంది. రాహుల్ రాక తో కాంగ్రెస్ క్యాడర్ లో జోష్ నిండుతుంది అని పార్టీ నేతలు భావిస్తున్నారు. 

అసెంబ్లీఎన్నికలకు.. పార్లమెంట్ ఎన్నికలకు చాలా తేడా వుంటుందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. జాతీయ అంశాలు మాత్రమే ప్రభావితం చేస్తాయని అంచనా వేస్తున్న .. కాంగ్రెస్ నేతలు.. విభజన చట్టం లోని అంశాలను కేంద్రం అమలు చేయలేదని.. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో ప్రజల దృష్టికి తీసుకెళ్తామని అంటున్నారు.

tags: Telangana loksabha shedule, Rahul Gandhi telangana tour, minimum income scheme, Rahul Gandhi new scheme, Sonia Gandhi tour in telangana, congress chevella meeting, konda visweswar Reddy, konda ranga Reddy wicky, kinda ranga Reddy district, cm kcr, Ktr loksabha meetings shedule, Rahul Gandhi shedule, maheswaram constency, maheswaram constency mla, Sabitha Indra Reddy, chevella mp.

Related Post