పార్టీ ఫిరాయింపుల పై లోక్ పాల్ కు ఫిర్యాదు చేస్తం

news02 March 23, 2019, 10:21 p.m. political

Pcc chief Utham Kumar Reddy fires on cm kcr

 

 

హైదరాబాద్ : ఎమ్మెల్యేల పిరాయింపులపై కేసీఅర్ ను టార్గెట్ గా కాంగ్రెస్ పోరును ఉదృతం చేస్తుంది.ఇప్పడికే ప్రతిపక్షాలను ఏకం చేసిన కాంగ్రెస్ .. ఇప్పుడు ఫిరాయింపులపై కేసీఆర్ ను జాతీయ స్తాయిలో దోషిగా నిలబెట్టాలని డిసైడ్ అయ్యింది. దీనికోసం ఏకంగా .. రాష్ట్రపతి లోక్ పాల్ లకు ఫిర్యాదు చేసి.. ఈ ఆంశాన్ని జాతియా స్థాయిలో చర్చనీయాంశగా మార్చాలని పక్కా స్కెచ్ తో ముందుకెళుతుంది హస్తం పార్టీ.

టిఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ తో రగిలిపోతున్న తెలంగాణ కాంగ్రెస్.. టిఆర్ఎస్ పై పోరుకు సిద్దమవుతుంది. ఇప్పడికే క్షేత్ర స్థాయిలో .. గోడ దూకిన ఎమ్మెల్యేల తీరును ఎండగడుతూ .. లోకల్లో నిరసనలు చేస్తున్న హస్తం పార్టీ.. ఈ అంశంపై పోరాటాన్ని ఉధృతం చేయాలని భావిస్తుంది. సీఎం కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్న హస్తం ఆపార్టీ.. ఈ ప ఫిరాయింపులను ఆస్త్రంగా గులాబి బాస్ ను టార్గెట్ గా స్పీడ్ పెంచుతుంది.

Tpcc leaders met governer Narsimha

ఎమ్మెల్సీ ఎన్నికల నుండి మొదలైన టిఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ తో .. ఇప్పడి వరకు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. అంతేకాదు.. మరికొందరు ఎమ్మెల్యేలు గులాబి బాస్ టచ్ లో ఉన్నారన్న ప్రచారం జరగుతుంది. అయితే.. ఈ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీ ఉడికి పోతుంది. సాక్షత్తు సీఎం కేసీఆరే ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ .. దీనిపై కేసీఆర్ ను దోషిగా నిలిపేందుకు పక్కా ప్రణాళికలను సిద్దం చేస్తుంది. మొదట ఈ ఫిరాయింపులపై అఖిలపక్ష సమావేశంతో టిడిపి, జనసమితి, వామపక్షాల తోపాటు.. పలు ప్రజా సంఘాల మద్దతు కూడగట్టింది కాంగ్రెస్ పార్టీ.

మరోవైపు ఈ ఫిరాయింపులపై జాతీయ స్థాయిలో ఉధ్యమానికి రెఢీ అవుతుంది కాంగ్రెస్. దీనిలో బాగంగా.. కేంద్ర మాజీ న్యాయశాఖామంత్రి వీరప్ప మొయిలీని రంగలోకి దింపింది. గాంధిభవన్ లో టిపిసిసి ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో మొయిలీ పిరాయింపులపై చర్చించారు. ఇప్పడికే ఎమ్మెల్యేల పిరాయింపులకు సంబంధించి ఆధారాలను సేకరించిన టిపిసిసి.. వీటి ఆధారంగా .. కేసీఆర్ తీరును జాతీయా స్థాయిలో ఎండగడతామని అంటున్నారు పీసీసీ.తమ పార్టీ ఎమ్మెల్యే లను సీఎం కేసీఆర్ కోట్ల రూపాయలు గుమ్మరించి కొంటున్నా రని ఆరోపించారు పిసిసి చీఫ్ ఉత్తమ్. ఒక్కొక్క ఎమ్మెల్యేను ప్రగతి భవన్ లో 10కోట్లకు కొంతమందిని,15 కోట్లకు కొంత మందిని కొంటున్నారని ఆరోపించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్టీ మారే కాంగ్రెస్ MLA ల రాజీనామా లేఖను ప్రగతి భవన్ లో టైప్ చేస్తూ,నియోజకవర్గ అభివృద్ధికోసం పార్టీ మారుతున్నట్టు లెటర్ విడుదల చేస్తున్నారని అన్నారు.

Pcc chief utham

కేసీఆర్ ప్రలోభాలతో ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుంటున్నారంటున్న టికాంగ్రెస్.. దీనిపై అన్నీ రాజ్యాంగ సంస్థలను ఆశ్రయించాలని డిసైడ్ అయ్యింది. దీనిలో భాగంగానే గవర్నర్ ను కలిసి పిర్యాదు చేసింది. అందేకాదు.. ఈ వ్యవహారంపై త్వరలోనే రాషపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి పిర్యాదు చేయనుంది. అంతేకాదు.. సీఎం నివాసమే పార్టీ పిరాయంపులకు అడ్డగా మారిందని.. దీనిపై సమగ్ర విచారణ జరిపి.. రాజ్యాంగాన్ని కాపాడాలని ఏకంగా లోక్ పాల్ కు పిర్యాదు చేయనుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.

మొత్తానికి గులాబి ఆపరేషన్ ఆకర్ష్ తో డీలాపడిన తెలంగాణ కాంగ్రెస్ ఎట్టకేలకు తేరుకుని..పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్దమవుతుంది. దీనిలో బాగంగా రాష్ట్రపతి భవన్ గడప తొక్కడంతో పాటు.. తొలిసారి లోక్ పాల్ తలుపుతట్టి.. దీన్నిజాతీయ అంశంగా మార్చాలని భావిస్తుంది. మరి టిఆర్ఎస్ పై ఈ కాంగ్రెస్ వత్తిళ్లు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.

tags: Utham Kumar reddy, Pcc chief, Telangana Congress president, Rahul Gandhi, Rahul Gandhi direction, Sonia Gandhi, revantth reddy, Lok Sabha elections, Telangana loksabha constencies, Telangana election results, cm kcr, Rahul Gandhi contact numbers , Rahul Gandhi address, aicc president, MLA s joining in TRS.

Related Post