అభ్యర్ధుల ప్రకటనపై టీఆర్ఎస్ సతమతం..

news02 Nov. 1, 2018, 3:18 p.m. political

mahakutami

టీఆర్ ఎస్ చీఫ్ కేసీఆర్ తన రూటు మార్చుకున్నారు. మహాకూటమి అభ్యర్థులు లేకుండా ప్రచారసభలకు వెళ్తే పెద్దగా ఫలితం రావడం లేదని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారట. ఇంకేముంది టీఆర్ ఎస్ ప్రస్తుతం ప్రచారంలో వెనుకడుగు వేసింది. ఇక మహాకూటమి అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు సమాచారం. ఈనెల 2వ తేదీన మహాకూటమి అభ్యర్థుల జాబితా వెలువడనుండటంతో. దీనికి అనుగుణంగా ఎన్నికల ప్రచార తేదీలను నిర్ణయించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

kcr

ప్రగతి భవన్ లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం జరిగింది. ఇందులో ఆయన ఎన్నికల ప్రచారంపై స్పష్టత ఇచ్చినట్టు గులాబీ నేతలు చెబుతున్నారు. గతంలో ఒకేసారి 105 మంది అభ్యర్ధులను ప్రకటించిన కేసీఆర్.. మిగిలిన సీట్లలో అభ్యర్ధుల విషయంలో మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. మహూకూటమి రోజురోజుకు తెలంగాణలో బలం పుంజుకుంటుండటంతో కేసీఆఆర్ లో భయం పట్టుకుందన్న వాదన వినిస్తోంది. అందుకే మహాకూటమి అభ్యర్ధుల ప్రకటన వెలువడే వరకు వేచి చూస్తున్నారట. గతంలో ఒకేసారి 105 మంది అభ్యర్ధులను ప్రకటించి తప్పుచేశానన్న భావనలో ఉన్న కేసీఆర్.. ఇప్పుడు మళ్లీ ఆ తప్పు చేయకూడదని భావిస్తున్నారట. 

uttam

అంతే కాదు మహాకూటమి అభ్యర్ధుల ప్రకటన తరువాత అవసరమైతే గతంలో ప్రకటించిన 105 మంది అభ్యర్ధుల్లో కొంత మందిని మార్చాలన్న ఆలోచన కేసీఆర్ చేస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న టీఆర్ ఎస్ నేతలకు ఎక్కడికక్కడ జనం తరిమికొడుతుండటం కేసీఆర్ కు ఆదంలోన కలిగిస్తోందట. అందుకే ఎన్నికల ప్రచారాన్ని కాస్త నిదానంగా చేసుకోవాలని నేతలకు సూచించారని తెలుస్తోంది. రోజురోజుకు మహాకూటమి గ్రాఫ్ పెరుగుతూ.. అదే క్రమంలో టీఆర్ ఎస్ గ్రాఫ్ పడిపోవడంతో.. ఏంచేయాలో పాలుపోక ఆయోమయంలో పడ్డారట టీఆర్ ఎస్ నేతలు.

tags: mahakutami, kcr, kcr afraid of mahakutami, kcr thinking about candidates, kcr , KCR on reconsideration of candidates

Related Post