ర‌క్ష‌ణ మంత్రి పార్ల‌మెంట్ లో దాక్కున్నారు.

news02 Jan. 2, 2019, 11:43 p.m. political

rahula_target_modi_on_rafel deal, parliament

న్యూడిల్లీ - రాహుల్ గాంది.. పార్ల‌మెంట్ వేదిక‌గా.. మ‌రోసారి రెచ్చిపోయారు. మోడి స‌ర్కార్ ను ఏకిపారేశారు. రాఫెల్ డీల్ పై నేరుగా ప్ర‌దాని మోడినే టార్గెట్ చేస్తూ.. విమ‌ర్శ‌లు గుప్పించారు రాహుల్. పార్ల‌మెంట్ లో రాఫెల్ పై చ‌ర్చ జ‌రుగుతుంటే.. స‌మాదానం చెప్పే ధైర్ఘ్యం లేక‌నే.. ప్రధాని త‌న ఛాంబ‌ర్ లో కుర్చున్నారని ద్వ‌జ‌మెత్తారు రాహుల్. ఇక ర‌క్ష‌ణ శాఖా మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ పై సెటైర్లు గుప్పించారు రాహుల్.  క‌నీసం స‌మాధానం చెప్పాల్సిన  భాద్య‌త‌లో ఉన్న నిర్మ‌లా సీతారామ‌న్.. స‌భ‌లో ఉండి.. డిఎంకే స‌భ్యుల వెన‌క దాక్కున్నార‌ని అన్నారు. రాఫెల్ డీల్ పై కాంగ్రెస్ ప్ర‌శ్నల‌కు మోడి స‌మాధానం చెప్ప‌కుండా..  త‌ప్పించుకుంటున్నార‌ని.,  గ‌తంలో కూడా.. చెప్పాల్సింది చెప్ప‌కుండా.. ఐదు నిమిషాల్లో త‌న ప్ర‌సంగాన్ని ముగించార‌ని ఎద్దెవా చేశారు రాహుల్.

/rahul_on_rafel_scame

రఫేల్ ఒప్పందానికి  సంబంధించిన పత్రాలు  గోవా సీఎం మనోహర్‌ పారికర్‌ బెడ్‌ రూంలో ఉన్నాయన్న గోవా మంత్రి వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో టేపులను పార్ల‌మెంట్ ముందు పెట్టాల‌ని రాహుల్ డిమాండ్ చేశారు. దీంతో బీజేపి స‌భ్యుల ఆరోప‌ణ‌ల‌తో స‌భ ఒక్క‌సారిగ వేడెక్కింది. సుప్రిం కోర్ట్ రాఫెల్ వ్య‌వ‌హారంపై విచార‌ణ త‌మ ఫ‌రిదిలోకి రాద‌ని చెప్పింది కాని.. రాఫెల్ పై జేపీసీని వేయ‌వ‌ద్ద‌ని అని ఎక్క‌డా చెప్ప‌ల‌ద‌న్న‌రాహుల్ గాంది.. త‌క్ష‌న‌మే.. జేపీసీ వేయాల‌ని డిమాండ్ చేశారు. ఇక త‌న‌పై వ్య‌క్తిగతంగా చిన్న ఆరోపణ కూడా లేదన్నమోడి వ్యాఖ్య‌ల‌పై  రాహుల్ మండిప‌డ్డారు. మోడి తాజాగా ఇచ్చిన‌ ఓ ఇంట‌ర్యూలో.. రాఫెల్ పై పొంత‌న‌లేని స‌మాధానాల‌ను చెప్పార‌ని అన్నారు. రాఫెల్ ఒప్పందంలో ..నాలుగు వందల కోట్ల విలువ చేసే ఒక్కో విమానాన్ని .. 1600 కో్ట్ల రూపాయ‌ల‌కు ఎందుకు కొన్నారో మోడి చెప్ప‌లేద‌న్న‌రాహుల్.. మోడి త‌న ప్యారా దోస్థ్ అంబాని కోస‌మే ఇంద‌తా చేశార‌ని ఆరోపించారు.

tags: rahula gandhi, pm modi, rafel deal, debat, parliament, nirmala seetharaman, parikar, cm goa, anil ambani, rafel deal, congres

Related Post