ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ల కోసం టీఆర్ఎస్ వేట..

news02 May 13, 2019, 7:16 p.m. political

Jumped congress MLA s

పదకొండు మంది ఓకే చెప్పేశారు.. సంతకాలు కూడా చేసేశారు.. కానీ అనుకున్న పని పూర్తి కావాలంటే ఇంకా ఇద్దరు కావాలి. ఇదంతా కాంగ్రెస్ ఎల్పీ టీఆర్ఎస్ ఎల్పీ లో మెర్జ్ అయ్యేందుకు జరుగుతున్న తతంగం.. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఇప్పటికే మెర్జ్ కార్యక్రమం అయిపోయేది. కానీ ఆ ఇద్దరు ఎమ్మెల్యే లు సిద్దంగా లేక ఆగింది. ఈ మెర్జ్ కార్యక్రమానికి క్లైమాక్స్ పలకబోతున్న ఇద్దరు ఎమ్మెల్యే లు ఎవరు.. ? అనేది హాట్ టాపిక్ గా మారింది. 

కాంగ్రెస్ ఎల్పీ టీఆర్ఎస్ లో మెర్జ్ కావాలంటే ఖచ్చితంగా 13మంది ఎమ్మెల్యే లు కావాలి. ఇప్పటికైతే 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇంకా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తే కాంగ్రెస్ ఎల్పీ .. టీఆర్ఎస్ లో మెర్జ్ అవుతుందనీ గులాభి నేతలు భావిస్తున్నారు. అందరూ కలిసి స్పీకర్ కు లేఖ ఇస్తే .. ఈ తతంగం అంతా పూర్తవుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఎల్పీ మెర్జ్ కు సంభందించిన లేఖను టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం లో సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Congress MLA s

రేగ కాంతారావు నుంచి రీసెంట్ గా టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించిన గండ్ర వెంకట రమణా రెడ్డి వరకు మొత్తం 11 మంది ఎమ్మెల్యే లు అయ్యారు. ఇంకో ఇద్దరు చేరితే ఇప్పటికే కాంగ్రెస్ ఎల్పీ నీ టీఆర్ఎస్ లో మెర్జ్ అయిపోయేది. అయితే ఇంకో ఇద్దరు ఎమ్మెల్యే లు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా లేనందుకు .. మెర్జ్ ప్రక్రియ కు బ్రేక్ పడింది. కాంగ్రెస్ ఎల్పీ మెర్జ్ కు కావాల్సిన ఇద్దరు ఎమ్మెల్యే కోసం టీఆర్ఎస్ వేట ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యే లు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం అవుతోంది. 8 అయితే తను టీఆర్ఎస్ లో చేరేందుకు తనకు కొంత సమయం కావాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చెబుతున్నట్లు తెలుస్తోంది. జగ్గా రెడ్డి టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా .. ఆయనను టీఆర్ఎస్ లో చేర్చుకునే అంశంపై పార్టీ అధిష్టానం అయిష్టంగ వున్నట్లు తెలుస్తోంది. ఇక ములుగు ఎమ్మెల్యే సీతక్క .. కాంగ్రెస్ లో వుంటానని తెగేసి చెప్పిన ట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన శ్రీధర్ బాబు కూడా టీఆర్ఎస్ లో చేరుతున్న ట్లూ ప్రచారం జరుగుతున్నా ఆయన క్లారిటీ ఇవ్వటం లేదు. భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య పెట్టిన డిమాండ్స్ అసాధారణంగా వున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన చేరిక ఇంకా చర్చల స్థాయిలోనే వుంది. తను పార్టీ మారేది లేదని అనుచరులకు చెబుతున్నాడు.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల లోపే కాంగ్రెస్ ఎల్పీ మెర్జ్ జరిగి పోవాలని టీఆర్ఎస్ బావించినా ఇద్దరు ఎమ్మెల్యే లు లేక పని ఆగిపోయింది. కేసీఆర్ తలనొప్పిని తగ్గించే ఆ ఇద్దరు ఎమ్మెల్యే లు ఎవరనే చర్చ ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

tags: Cm kcr , kcr cabinet ministers, Telangana cabinet portfolios, cm kcr family, Harish Rao portfolios, minister Harish Rao, Telangana governament, MLA malla Reddy, Thalasani Srinivas Yadav, Indrakaran, tclp, tclp meeting, utham Kumar Reddy, clp leader.

Related Post