బీజేపీకి సాయం కావాలంటే చేస్తాం

news02 March 6, 2019, 8 p.m. political

bjp site hack

బీజేపీ అధికారిక వెబ్‌సైట్‌ మంగళవారం హ్యాక్‌ అయింది. గుర్తు తెలియని వ్యక్తులు బీజేపీ వెబ్ సైట్ ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో వెబ్ సైట్ ను మళ్లీ పునరుద్దరించందుకు బీజేపీ తెగ ప్రయత్నం చేస్తోంది. ఈ రోజు కూడా బీచేపీ వెబ్‌సైట్‌ తెరచుకోవట్లేదు. త్వరలోనే మళ్లీ కలుస్తాం అనే సందేశం మాత్రమే వెబ్ సైట్ లో కనపడుతోంది. ఇంకేముంది బీజేపీ పార్టీకి కాంగ్రెస్‌ పార్టీ చురకలు అంటించింది. వెబ్ సైట్ విషయంలో కావాలంటే తాము సాయం చేస్తామని కాంగ్రెస్ ప్రకటిచింది. శుభోదయం బీజేపీ.. చాలా సమయం పాటు మీ వెబ్‌ పనిచేయట్లేదని గుర్తించాం.. మళ్లీ అది పని చేసేందుకు మీకు సాయం కావాలంటే, అందుకు మేము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో స్పష్టం చేసింది. ఈ సందేశంతో పాటు.. ఆలింగనం చేస్తున్న ఎమోజీని కూడా జతచేసింది. బీజేపీ వెబ్‌సైట్‌ చిత్రాన్ని పోస్ట్‌ చేసింది. 

tags: bjp, bjp website, bjp website hacking, congress on bjp website hacking, congress comments on bjp website hacking

Related Post