విష రాజకీయ వాతావరణంలో

news02 Feb. 12, 2019, 7:53 a.m. political

rabert

ఆమెను దేశ ప్రజలకు అప్పగిస్తున్నాం

 

నా భార్యను జాగ్రత్తగా చూసుకొండని ప్రియాంక గాంధీని ఉద్దేశించి ట్వీట్ చేశారు ఆమె భర్త రాబర్ట్ వాద్రా. ప్రియాంక గాంధీ వాద్రా  కాంగ్రెస్‌ పార్టీ ఉత్తర్‌ప్రదేశ్‌ తూర్పు విభాగానికి ప్రధాన కార్యదర్శి హోదాలో తొలిసారిగా లఖ్‌నవూలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రాబర్ట్‌ వాద్రా సోషల్‌ మీడియా వేధికగా అభినందనలు తెలిపారు. ఈ విష రాజకీయ వాతావరణంలో నా భార్యను జాగ్రత్తగా చూసుకోండని రాబర్ట్ వాద్రా ప్రజలను కోరారు. ప్రజలకు సేవ చేసేందుకు నువ్వు ప్రారంభించిన ఈ సరికొత్త ప్రయాణంలో నీకు అంతా మంచే జరగాలని ప్రియాంక గాంధీని ఉద్దేశించి ట్విట్టర్లో పేర్కొన్నారు.

rabert

అంతే కాదు నువ్వు నాకు మంచి స్నేహితురాలివి.. పరిపూర్ణమైన భార్యవి.. నా పిల్లలకు గొప్ప తల్లివి.. నేడు దేశంలో ప్రతీకార, విషపూరిత రాజకీయ వాతావరణం ఉంది.. కానీ ప్రజలకు సేవ చేయడం ఆమె బాధ్యత అని నాకు తెలుసు.. అందుకే ఆమెను ఈ దేశ ప్రజలకు అప్పగిస్తున్నాం.. జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్‌ అంటూ ఉద్వేగభరితంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు రాబర్ట్ వాద్రా.

 

tags: rabert, rabert vadra, rabert vadra about priyanka, rabert about priyanka, rabert vadra about priyanka gandhi, rabert vadra about priyanka road show

Related Post