త్వరలోనే అన్ని కమిటీల భర్తీ

news02 Jan. 5, 2019, 2:33 p.m. political

uttam

అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్ధులే ఇప్పుడు పంచాయితీ ఎన్నికల భాద్యతలు వహిస్తారని పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. గాంధీభవన్ లో జరిగిన పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షా సమావేశంలో పీసిసి చీఫ్ ఉత్తమ్ సహా పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా, శ్రీనివాస్ కృష్ణన్, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ ఆలి తదితరులు పాల్గొన్నారు. అదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, కరీంనగర్, జహీరాబాద్, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాలపై ఈ భేటీలో సమీక్షించారు. జనవరి 14వ తేదీతోపు బూత్, మండల, బ్లాక్ స్థాయిలో పూర్తిగా కమీటీలను నియమించాలని ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. 

uttam

అటు ఓటర్ల నమోదు విషయంలోను ప్రత్యేక శ్రధ్ద తీసుకోవాలని నేతలకు దిశానిర్ధేశం చేశారు. నేతలంతా సమన్వయంతో పనిచేసి లోక్ సభ ఎన్నికల్లో సాధ్యమైనన్నీ ఎంపీ సీట్లను గెలుచుకోవాలని ఉత్తమ్ సూచిచంచారు. ఇక ఏఐసిసి ఆదేశాల మేరకు తెలంగాణలో 33 జిల్లాలకు త్వరలోనే డీసీసీ అధ్యక్షులను నియమిస్తామని చెప్పిన ఉత్తమ్.. నియోజకవర్గాల వారిగా డీసీసీ అధ్యక్షుల కోసం పేర్లను సిఫారసు చేయాలని పార్టీ నేతలకు చెప్పారు.

tags: pcc chief, uttam, uttam kumar reddy, pcc chief uttam kumar reddy, uttam about panchayat elections, uttam about mp elections

Related Post