ఢిల్లీ మాజీ సీఎం షీలా మృతి

news02 July 20, 2019, 8:29 p.m. political

shiela

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు షీలా దీక్షిత్‌ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. షీలా దీక్షిత్ వయస్సు 81 సంవత్సరాలు. 1938 మార్చి 31న పంజాబ్‌లోని కపుర్తాలలో షీలా దీక్షిత్ జన్మించారు. 1998 నుంచి 2013వరకు మొత్తం మూడు పర్యాయాలు 15 సంవత్సరాల పాటు షీలీ దీక్షిత్ దిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో విద్యనభ్యసించిన షీలా దీక్షిత్‌ కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. షీలా దీక్షిత్ మృతి పట్ల యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాందీ, రాహూల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు-నల్గొండ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.

 

tags: shiela dixit, shiela dixit died, shiela dixit no more, shiela dixit expired, uttam condolence to shiela dixit, delhi ex cm shiela dixit no more, delhi ex cm shiela dixit died

Related Post