అట్టహాసంగా నామినేషన్ వేసిన ఉత్తమ్

news03 March 23, 2019, 5:31 p.m. political

uttam

ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు భారత దేశ చరిత్రలో కీలకం కానున్నాయని పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్దిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తమ్ నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్బంగా టీఆర్ ఎస్, బీజేపీ సర్కార్ పై ఉత్తమ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోడీ ప్రధాని అయిన తరువాత  దేశాన్ని విఛ్చిన్నం చేసే ప్రయత్నం చేశారని ఆయన మండిపడ్డారు. దేశంలో మైనారిటీల పై దాడులతో అభద్రతను కలిపించింది బిజెపి ప్రభుత్వమేనని ఉత్తమ్ విమర్శించారు. 2014 ఎన్నికల సందర్బంగా ఇచ్చిన ఓ ఒక్క హామీని కూడా మోదీ నెరవేర్చ లేదని ఫైర్ అయ్యారు. నల్లధనం తీసుకొచ్చి పేదలకు పంచుతాననని.. నిరుద్యోగ సమస్య తీరుస్తానని..రైతులకు మేలు చేస్తానని ప్రగల్బాలు పలికిన మోదీ.. ఈ ఐదేళ్లలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ఇక ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ వర్సెస్ మోదీ నినాదంతో జరుగుతున్నాయని పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ అంశాన్ని  రాష్ట్ర ప్రజలు గమనించాలని ఆయన విన్నవించారు. 

uttam

మొన్నటి వరకు 16 మంది ఎంపీల ముద్దతు ఉన్న కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్రానికి ఏమి తేలేకపోయారని ఉత్తమ్ గుర్తు చేశారు. కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్సిటీ.. ఇలా ఏ ఒక్కటీ కేసీఆర్ సాధించలేకపోయారని ఉత్తమ్ విమర్శించారు.  కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో మంజూరైన ఐటిఐఆర్ కూడా బీజేపీ సర్కార్ హయాంలో రద్దయిందని.. అయినప్పటికీ కేసీఆర్ ఏమీ చేయలోకపోయారని ఉత్తమ్ మండిపడ్డారు. ఇక తెలంగాణలో భారీ సాగునీటి ప్రాజెక్టులకు సైతం కేసీఆర్ జాతీయ హోదా తీసుకురాలేకపోయారని ఉత్తమ్ విమర్శించారు. అటు ముస్లింలకు రిజర్వేషన్లు కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఆధారంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. 

uttam

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్లు, గిరిజన యూనివర్సిటీ, ఐటీఐఆర్ ప్రాజెక్టు, నీటి పారుదల ప్రాజెక్టు కు జాతీయ హోదా కలిపిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక తాను నల్గొండ ఎంపీగా గెలిస్తే.. గతంలో హుజుర్ నగర్ నియోజకవర్గానికి ప్రగతి కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టానో, నల్గొండ ఎంపీ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో అబివృద్ది చేసి చూపిస్తానని  ఉత్తమ్ హామీ ఇచ్చారు. రాష్ట్రం లో 16 ఎంపీ సీట్లలో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుందని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. అటు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి పార్లమెంట్ స్థానానికి భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ కార్యకర్తలు పనిచేయాలని పిలుపినిచ్చారు. 
 

tags: uttam, pcc chief uttam, utaam kumar reddy, pcc chief uttam kumar reddy, uttam nomination, uttam kumar reddy nomination, uttam nomination for nalgonda loksabha, pcc chief uttam nomination for nalgonda loksabha, utta, fire on om modi, uttam fire on cm kcr

Related Post