అమరవీరుల స్థూపాన్ని బంధించిన తెలంగాణ సర్కార్

news02 March 11, 2018, 10:57 p.m. political

Gun park mytries memorial

హైదరాబాద్: అమర వీరుల స్థూపానికి సంకెళ్లు హైదరాబాద్ :అది నాంపల్లి గన్ పార్క్ లోని అమరవీరుల జ్ఞాపకం. దాన్ని చూస్తే మనసులు ఉప్పొంగుతాయి. ఉద్యమం కాలం నాటి పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. అదే గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం.. కాని ఇప్పుడు ఆ స్తూపానికి సంకెల్లు పడ్డాయి. సమైఖ్యాంద్ర లో కూడా లేని విదంగా ఇతరులు ప్రవేశించకుండా ఇనుప గ్రిల్స్ తో గన్ పార్క్ ను బంధించింది తెలంగాణ ప్రభుత్వం .

తెలంగాణ ప్రజలకు సెంటిమెంట్ గా భావించే అమరవీరుల స్థూపం కనపడకుండా చుట్టూ 10 ఫీట్ల ఎత్తులో ఇనుప గ్రిల్స్ బిగించారు. తెలంగాణ ఉద్యమం జరిగిన టైం కూడా ఈ రేంజ్ లో ఇనుప కంచె వేయలేదు. తెలంగాణ ప్రజలు అమరవీరుల స్తూపం దగ్గరకు వెళ్ళకుండా చేయలేదు. ఎప్పుడు లేని విదంగా పర్మనెంట్ ఇనుప గ్రిల్స్ పెదలెట్టడం చర్చనీయాంశంగా మారింది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అమరవీరుల స్థూపానికి సంకెళ్లు వేయటంపై రోడ్డున వెళుతున్న ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారు. తన పాలనపై ఎవరు ఉద్యమాలు చేసినా నచ్చని కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడు తున్నారని భావిస్తున్నారు ప్రజలు.

tags: Gunpark, nampally, ts mytries memorial, telangana agitation, cm kcr, telangana monark.

Related Post