నిజాన్ని జీర్ణించుకోలేక పోయిన టీఆర్ఎస్ అధిష్టానం

news02 May 1, 2018, 6:55 p.m. political

journalist articles

నిజం నిప్పు లాంటిది..  అదే నిప్పులాంటి వార్త అయితే.. ఆ నిజాన్ని పాలకులు జీర్ణించుకోలేకపోతే.. అది ఎక్కడికైనా దారి తీయొచ్చు. అలాంటిదే జరిగింది తెలంగాణ ప్రభుత్వంలో.. రాష్ట్రంలో టీఆర్ ఎస్ పార్టీని విశ్లేషిస్తూ ఆర్టికల్ రాసిన మంత్రి హరీష్ రావు పీఆర్వో, సీనియర్ జర్నలిస్టు జకీర్ ఉద్యోగం ఊడింది.

20 యేళ్ళ పాటే జర్నలిజం లో ఉన్నారు జకీర్. ఈనాడుతో మొదలుపెడితే .. ప్రముఖ చానళ్లలో పనిచేసిన అనుభవం ఉంది. రెండేళ్ల క్రితం నుంచి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు దగ్గర పీఆర్వేగా పనిచేస్తున్నారు. హరీష్ రావు వేగాన్ని అందుకొని ఆయన ఆలోచనను అర్థం చేసుకొని మంత్రికి తగ్గ పీఆర్ఓ గా పేరు తెచ్చుకున్నాడు. జర్నలిస్టుగా గుల చావని జకీర్ " పాలన సరే.. పార్టీ పరిస్థితి ఏంటి " అని పేరుతో ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ రాశారు. ఇప్పుడదే ఆర్టికల్ జకీర్ ఉద్యోగానికి ఎసరు పెట్టింది.

jakeer andrajyothi article

టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ పాలనపై దృష్టి పెట్టారు కానీ పార్టీ పరిస్థితి బాగా లేదనేది జకీర్ రాసిన ఆర్టికల్ సారాంశం. కేసీఆర్ పర్యటనలు చేసి ప్రజలకు, కార్యకర్తలకు దగ్గర కావాలని ఆర్టికల్ లో రాశారు. ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వున్నా టిఆర్ఎస్ పార్టీ కి రిపేర్ చేసుకోవాల్సివుందని జకీర్ తన ఆర్టికల్ లో రాశారు. ప్రభుత్వంలో అతి ప్రధానమైన మంత్రి హరీష్ రావు కు పీఆర్వోగా ఉండి .. టిఆర్ఎస్ కు రిపేర్ చేయవలసిన అవసరం ఉందని ఆర్టికల్ రాయడాన్ని టిఆర్ఎస్ నేతలు జీర్జించుకోలేక పోయారు.

ఆంధ్రజ్యోతి లో ఏప్రిల్ 25 న ఈ ఆర్టికల్ ప్రచురితమైంది. అప్పటినుంచి ప్రగతిభవన్ నేతలు ఈ ఆర్టికల్ పై కుతకుతలాడుతున్నారట. కేసీఆర్ చుట్టు వుండే హరీష్ రావు వ్యతిరేకులు .. ఈ ఆర్టికల్ ను ఆయనే రాయించి ఉంటారని ప్రచారం చేశారు. దీంతో హరీష్ రావు తన పీఆర్వో ఉద్యోగం నుంచి జకీర్ ను తప్పించినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కూడా ఆర్టికల్ పై హరీష్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

minister harish rao with cm kcr

ఆ వార్త నిజం.. అందులోని సారాంశం నిజం.. ఆ నిజాన్ని పాలకులు జీర్ణించుకోలేకపోయారంటూ జకీర్ కు సోషల్ మీడియా వేదికగా పలువురు మద్దతుగా నిలిచారు. అయితే తనది తప్పే నని జకీర్ చెబుతున్నారట. టిఆర్ఎస్ లో ప్రకంపనలు సృష్టించిన ఈ కథనం వ్యవహారం ఇక్కడితో ముగుస్తుందో లేదా ఎక్కడికి దారి తీస్తుందో అన్న చర్చ జరుగుతోంది.

Related Post