హైదరాబాద్ః నేరెళ్ల బాధితుల కు ఏడాది గడిచినా న్యాయం జరగపోవడం సిగ్గుచేటన్నారు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సిరిసిల్ల లో నిత్యం ఇసుక లారీలతో జనం ను చంపేస్తున్నారని అన్నారు. జనం చచ్చినా సరే డబ్బులు ఉంటె సరే అన్నట్లు టిఆర్ ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఉత్తమ్. గాంధీభవన్ లో నేరెళ్ల బాధితులతో సమావేశమైన కాంగ్రెస్ నేతలు ... ప్రభుత్వ వ్యవహారంపై చర్చించారు. కేటీఆర్ ఆదేశాలతో సీరిసిల్ల లో దళితులు ,గిరిజనులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని అన్నారు. ఇసుక మాఫియాతో కెసిఆర్ ఫ్యామిలి దోచుకుంటుందని ఆరోపించారు. రాష్ట్రం లో కేసీఆర్ కుటుంబం ,టీఆరెస్ నేతలు రాబందులు గా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్డ్ డిగ్రీ చేసిన అధికారిని కేటీఆర్ నెత్తిన పెట్టుకుని నేరెళ్ళ ప్రజలను హిసింస్తున్నారని విమర్శించారు.
సిరిసిల్ల బాధితుల కు న్యాయం జరగాలనీ uఈనెలాఖరున సిరిసిల్లలో నిరసన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే సిరిసిల్ల లో దళిత గిరిజన గర్జన సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాహుల్ ను సిరిసిల్ల సభలకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇసుక ఆదాయం గురించి కేటీఆర్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల పై హింసించిన పోలీసు అధికారుల పై ఎందుకు చర్యలు తీసుకులేదో కేటీఆర్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఏడాది గడిచేనా సిరిసిల్ల ఘటనపై ఛార్జ్ షిట్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. కేసిఆర్ కు కాలం దగ్గర పడ్డదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు ,గిరిజనులపై కేసీఆర్ కక్ష సాధిస్తున్నారని అన్నారు.
సిరిసిల్ల లో జనం ను చంపేస్తున్న ఇసుక లారీ లపై ఇప్పడికి ఒక్క కేసు పెట్టలేదని నేరెళ్ళ బాదితులు తెలిపారు. ఇసుక మాఫియా వెనక ఖచ్చితంగా కేటీఆర్ ఉన్నారని అన్నారు. కేటీఆర్ ,లారీలనే అడ్డుకుంటారా అని మా పై ఎస్పీ థర్డ్ డిగ్రీతో కొట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కరెంట్ షాక్ పెట్టి హింసించారని తెలిపారు. ఏడాది గడుస్తున్నా ఇప్పడికి తమకు గాయాలు మానలేదని తెలిపారు. తాము చేసిన తప్పేంటి ..ఇప్పటికి కేసులతో వేధిస్తున్నారని అన్నారు. కేటీఆర్ వస్తుందంటే ఇప్పటికి తమను పోలీసుల పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారని తెలిపారు నేరెళ్ళ బాదితులు.
*ఆగస్టు నుండి 100 రోజుల పార్టీ ప్రచార కార్యక్రమం చేపడుతాం *
*బస్ యాత్ర మూడవ విడత మొదలవుతుంది *
*నేతల పాదయాత్ర లు కూడా ఉంటాయి *
*ఎవరెవరు అన్నది త్వరలోనే ప్రకటిస్తాం *
*పార్టీకి లాభం జరిగేవిధంగా ఎవరు ..?ఎలాంటి కార్యక్రమం చేపట్టినా నాకు సమ్మతమే *
*మోడీని ని కలిసిన తర్వాతనే కేసీఆర్ ముందస్తు అన్నారు *
రాజస్థాన్ ,మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పకుండ గెలుస్తుంది