తెలంగాణ లో మెజార్టీ లోక్ సభ సీట్లు గెలవాలి

news02 Feb. 6, 2019, 8:22 a.m. political

Pcc chief utham met Rahul Gandhi

హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట‌మి బారాన్ని ప‌క్క‌న బెట్టండి.. పార్ల‌మెంట్ ఎన్నిక‌లకు సిద్దంకండి.. కేంద్రంలో వ‌చ్చేది మ‌న ప్ర‌భుత్వమే.. ఇది.. రాష్ట్ర కాంగ్రెస్ నేత‌ల‌కు రాహుల్ గాంధి చేసిన దిశా నిర్దేశం. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత తొలిసారి రాష్ట్ర నాయ‌క్వ‌తంతో భేటీ అయిన రాహుల్ .. పార్టీ సంస్తాగ‌త బ‌లోపేతం పై దృష్టిపెట్టాల‌ని ఆదేశించారు. 

Pcc chief utham Kumar Reddy met with Rahul Gandhi

అసెంబ్లీ ఎన్నిక‌ల‌ల్లో ఓట‌మి త‌ర్వాత తొలిసారి రాష్ట్ర ప‌రిస్తితుల‌పై దృష్టి సారించింది కాంగ్రెస్ హైక‌మాండ్. ఒక‌వైపు పార్ల‌మెంట్ ఎన్నిక‌లు త‌రుమొకొస్తుండ‌టంతో.. ఓట‌మి భారంతో డీలాప‌డిన రాష్ట్ర నాయ‌క్వ‌తాన్ని ..లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు సిద్దం చేసేప‌నిలో ప‌డింది అదిష్టానం. దీనిలో భాగంగా ఏఐసీసీ పిలుపుమేర‌కు పీసీసీ చీఫ్ ఉత్త‌మ్,సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌, ప్రాచార క‌మీటీ చైర్మ‌న్ విజ‌య‌శాంతి, పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ లు.. రేవంత్ రెడ్డి, పొన్నం, కుసుమ్ కుమార్, ఆజారుద్దీన్ లతో పాటు.. గెలిచిన ఎమ్మెల్యేలు రాహుల్ తో భేటీ అయ్యారు.

Utham Kumar Reddy met Rahul Gandhi

డిల్లీలో ని వార్ రూమ్ లో జ‌రిగిన ఈ భేటీలో రాహుల్ ..రాష్ట్రనాయ‌కత్వానికి ప‌లు అంశాల‌పై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తామ‌నుకున్న ప‌రిస్తితుల్లో ఘోరంగా ఓట‌మి పాలుకావ‌డంతో.. రాష్ట్ర నాయ‌క‌త్వం డీలాప‌డిపోయింది. దీనిని గుర్తించిన‌ రాహుల్ గాంధీ ప‌లు సూచ‌న‌లు చేశారు. రాజ‌కీయాల్లో గెలుపు, ఓట‌ములు స‌హ‌జం.. ఓట‌మి భారాన్ని ప‌క్క‌న బెట్టి.. ఓట‌మికి కార‌ణాల‌ను గుర్తించండి.. రానున్న పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఆ పొర‌పాటు జ‌ర‌గ‌కుండా చూసుకోవాల‌ని ఆదేశించారు రాహుల్. ఈవీఎం ల‌లో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌లు, పొల్ మెనేజ్ మెంట్ లో వైప‌ల్యం,, కేసీఆర్ అధికార దుర్వినియోగం.. సీట్ల స‌ర్దుబాటు లో జ‌రిగిన‌ ఆల‌స్యం... ఇలాంటి అంశాలు కాంగ్రెస్ గెలుపుకు గండికొట్టాయ‌ని.. రాష్ట్ర నాయ‌కులు..రాహుల్ దృష్టికి తెచ్చిన‌ట్లు స‌మాచారం. ఈ అనుభ‌వాల‌ను పాఠంగా తీసుకుని లోక్ సభ ఎన్నిక‌ల్లో పునరావృతం కాకుండా చూసుకోవాల‌ని.. ప్ర‌తి ఎంపీ సీటూ మ‌న‌కు కీల‌క‌మ‌ని సూచించారు రాహుల్. త్వ‌ర‌లోనే ఎంపీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిద్దామ‌న్న‌రాహుల్ .. అభ్య‌ర్థులు, ఎన్నిక‌ల‌కు సంబంధించి స‌మాచారంతో వ‌చ్చే వారం త‌న‌ను క‌లువాల‌ని ఉత్త‌మ్, భ్ట‌టి విక్ర‌మార్క‌ల‌ను ఆదేశించారు. ఈస‌మావేశంలో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచిన ఎమ్మెల్యేలను పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్ రాహుల్ కు ప‌రిచ‌యం చేయ‌గా.. రాహుల్ వారిని అభినందించారు. కొంద‌రు ఎమ్మెల్యేల‌తో వారి ఎల‌క్ష‌న్ కు సంబందించిన వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్న‌ రాహుల్ గాంధీ.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మ‌రింత‌ యాక్టీవ్ గా ఉంటూ ప్ర‌భుత్వాన్ని ఎండ‌గ‌ట్టాల‌ని సూచించారు. అంతేకాదు.. కేంద్రంలో వ‌చ్చేది మ‌న ప్ర‌భుత్వమే.. మీ అంద‌రికి మంచి భ‌విష్య‌త్ ఉంటుంద‌ని బ‌రోసా ఇచ్చారు రాహుల్.

Rahul Gandhi direction to Telangana Congress leaders

ఓట‌మితో డీ మోర‌ల్ అయిన క్యాడ‌ర్ ను యాక్టీవ్ చేస్తూ.. పార్టీని సంస్తాగతంగా బ‌లోపేతం చేయాల‌ని రాహుల్ పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్ కు సూచించారు. అంతేకాకుండా.. తొంద‌ర‌లోనే కొత్త డీసీసీల‌ను ప్ర‌క‌టించుకుని.. క్షేత్ర‌ స్తాయి నుండి..పార్టీ నిర్మాణం చేప‌ట్టాల‌ని ఉత్త‌మ్ ను ఆదేశించారు రాహుల్ గాంధి. మొత్తానికి అసెంబ్లీ ఎన్నిక‌ల‌ ఓట‌మి భాద‌లో ఉన్న రాష్ట్ర నాయ‌కత్వానికి రాహుల్ ధైర్ఘ్యం చెబుతూనే.... మ‌రోవైపు లోక్ స‌భ పోరుకు సిద్దం కావాల‌ని యాక్ష‌న్ ప్లాన్ ఇచ్చారు .

tags: Utham Kumar reddy, Pcc chief, Telangana Congress president, Rahul Gandhi, Rahul Gandhi direction, Sonia Gandhi, revantth reddy, Lok Sabha elections, Telangana loksabha constencies, Telangana election results, cm kcr, Rahul Gandhi contact numbers , Rahul Gandhi address, aicc president.

Related Post