చౌకబారు వ్యాఖ్యాలు మానుకోవాలి

news02 May 6, 2019, 9:17 p.m. political

rajeev

మాజీ ప్రధాని.. దివంగత రాజీవ్‌ గాంధీపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. ఇప్పటికే ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఏఐసిసి అధ్యక్షులు రాహుల్‌ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీతో సహా కాంగ్రెస్‌ సీనియర్లందరూ ఘాటుగా స్పందించారు. ప్రధాని మోదీ రాజీవ్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం తీవ్రంగా ఖండించారు. ఇక ఇప్పుడు ఈ విషయంలో కాంగ్రెస్‌ ఈసీని ఆశ్రయించింది. తమ మనోభావాలు దెబ్బతినేలా మోదీ మాట్లాడుతున్నారని.. అందుకని ప్రధానిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు కాంగ్రెస్ నేతలు.

modi

ప్రధాని మోదీ ఒక భారత రత్న అవార్డు గ్రహీతను అవమానించారని.. తమ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈసీకి లేఖ రాసింది. బహిరంగ ర్యాలీల్లో మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొంది. మరోవైపు దేశ వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా రాజీవ్ గాంధీపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. నరేంద్ర మోదీ ప్రధాని పదవి స్థాయిని దిగజార్చారంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

tags: modi on rajeev, pm modi on rajeev gandhi, modi comments on rajeev gandhi, congress fire on pm modi, rahul fire on pm modi

Related Post