మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి

news02 May 22, 2019, 6:58 a.m. political

rahul

 

ప్రేమ, అభిమానం, ఆప్యాయత కలిగిన వ్యక్తి మా నాన్న అని అన్నారు ఏఐసిసి అధ్యక్షులు రాహూల్ గాంధీ. ఇతరులను ప్రేమించడం, అందరిపట్ల గౌరవభావంతో ఉండటం నాకు నాన్నే నేర్పారని ఆయన చెప్పారు. ఎప్పుడూ ఎవరినీ ద్వేషించొద్దని, క్షమాగుణంతో ఉండాలని నాన్న చెప్పేవారని రాహూల్ గుర్తు చేసుకున్నారు. ఆయనను నేను ఎంతగానో మిస్సవుతున్నానని రాహూల్ ట్విట్ చేశారు. మాజీ ప్రధాని.. భారత రత్న రాజీవ్‌గాంధీ వర్థంతి సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తదితరులు ఆయనకు నివాళులర్పించారు. ఢిల్లీలోని రాజీవ్‌ స్మారక స్థలం వీర్‌భూమిని సందర్శించి అంజలి ఘటించారు.

 

tags: rajeev, rajeev gandhi, rajeev gandhi death anniversary, rajiv gandhi death anniversary, rahul floral tribute to rajeev gandhi, sonia floral tributes to rajiv gandhi

Related Post