అసెంబ్లీలో కాంగ్రెస్ నిరసన గళం

news02 March 12, 2018, 11:24 a.m. political

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం అయ్యాయి.  సభలో  రైతు ఆత్మహత్యలపై కాంగ్రెస్ నిరసన గళం విప్పింది. గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం ప్రారంభించగానే కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని రైతు ఆత్మహత్యల నుంచి కాపాడాలంటూ ప్లకార్డులతో ఆందోళన చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ నేతల ఆందోళనల మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగింది. బంగారు తెలంగాణ సాధన కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని.. మూడున్నరేళ్ల పాలనలో ప్రభుత్వం ఎన్నో సవాళ్లను ఎదుర్కుందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. రాష్ట్రం ఆర్ధికాభివృద్ధిలో దూసుకుపోతోందని.. దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.

tags: governor, speech, assembly, telangana, congress

Related Post