ఉత్తమ్ పై హైకమాండ్ నమ్మకం

news02 Feb. 5, 2019, 9:19 p.m. political

Pcc chief Utham Kumar reddy

హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల ప్రిపరేషన్ కాంగ్రెస్ మొదలుపెట్టింది. పీసీసీ ఛీప్ ఉత్తమ్ నాయకత్వంలో మెజార్టీ లోక్ సభ సీట్లలో గెలిచేందుకు కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ దొంగ లెక్కలతో గెలిచిందని భావిస్తున్న కాంగ్రెస్.. ఈసారి టిఆర్ఎస్ ను మట్టి కరిపించెందుకు పక్కా స్కెచ్ వేస్తున్నారు. 

Pcc chief utham Kumar reddy

లోక్సభ ఎన్నికలు ఉత్తమ్ నాయకత్వంలోనే వెళ్లాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పార్టీ సీనియర్ లకు ఉత్తమ్ నాయకత్వాన్ని బలపర్చాలని సూచించింది. అసెంబ్లీ ఎన్నికల్లో నైతికంగా కాంగ్రెస్ పార్టీయే గెలిచిందని పార్టీ హై కమాండ్ భావిస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించటంతో కాంగ్రెస్ పై ప్రజలకు వున్న అభిమానం బయట పడిందని అనుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కుట్రలు చేసి గెలించిందని పార్టీ హై కమాండ్ గట్టిగా నమ్ముతోంది. కెప్టెన్ గా ఉత్తమ్ పార్టీ నీ సరి అయిన దారిలో నడిపిస్తున్నారని భావిస్తున్న ఢిల్లీ పెద్దలు.. లోక్ సభ ఎన్నికల్లో ఉత్తమ్ నాయకత్వాన్ని బలపార్చాలని పార్టీ సీనియర్లకు సూచించినట్టు సమాచారం.

Utham Kumar Reddy latest

ఏ రాష్ట్రం లో అయినా ఎన్నికల్లో ఓడిపోతే వెంటనే ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుని మార్చేస్తుంది హై కమాండ్. లోక్ సభ ఎన్నికల తర్వాత కూడా ఉత్తమ్ నే పిసిసి చీఫ్ గా కొనసాగించాలని హస్తిన పెద్దలు భావిస్తున్నారట. ఎమ్మెల్యేలు కూడా పిసిసి చీఫ్ గ ఉత్తమ్ నే కొనగించాలని హై కమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. రాహుల్ ను కలిసినప్పుడు ఇదే విషయం చెప్పాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి పై పార్టీ నాయకులంతా నమ్మకంతో వుండటం తో హై కమాండ్ కూడా అదే కోణం లో ఆలోచిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం.

tags: Pcc chief utham, Telangana loksabha election, Republic Day, గాంధీభవన్, Gandhi Bhavan, pm Modi birthday, kcr birthday, Ktr birthday, Telangana Bhavan address, cm kcr address, nampally, utham Kumar Reddy address , Vutham Kumar Reddy phone number, utham Kumar Reddy family, utham Kumar Reddy daughter.

Related Post