రెడ్ హ్యాండెడ్ గా మీడియాకు దొరికిన వైసీపీ ఎంపీ

news02 June 11, 2018, 8:55 p.m. political

Mothkupalli narsimhulu with jagan

 టీడీపీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి ఏదో ఒక యాత్ర చేయ‌బోతున్నారు. అయితే అది తెలంగాణ‌లో మాత్రం కాదు. ఆంధ్ర‌లో.. ఆంద్ర‌లో ఎందుకు.. ఆయ‌న తెలంగాణ లీడ‌ర్ క‌దా అంటారా.. నిజ‌మే ఆయ‌న భువ‌న‌గిరి జిల్లాకు చెందిన ఆలేరు నియోజ‌క‌వ‌ర్గం నేత‌. గ‌తంలో అక్క‌డినుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచాడు కూడా. అయితే ఆయ‌న పాత‌యాత్ర ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే.. లేక‌పోతే ఆయ‌న జిల్లాలోనే, తెలంగాన లోనే పాద‌యాత్ర చేయాలి క‌దా.. కాని మోత్కుప‌ల్లి న‌ర్సింహులు మాత్రం ఆయ‌న యాత్ర‌ను ఏపీలో చేసేందుకు సిద్ద‌మ‌వుతున్నాడ‌ని తెలిసింది.

Mothkupalli yatra

ఏపీలో మోత్కుప‌ల్లి పాద‌యాత్ర చేసేందుకు కార‌ణాలేంటివ‌ని అనుకుంటున్నారా.. ఇంకేంటి టీడీపీ అధినేత చంద్ర‌బాబు అస‌లు బండారాన్ని బ‌య‌ట‌పెట్టేందుకే న‌ట‌. టీడీపీ నుంచి బ‌హిష్కరించిన త‌ర్వాత మోత్కుప‌ల్లి ఏపీలో పాదయాత్ర చేసి చంద్ర‌బాబు ద‌ళితుల‌కు చేసిన ద్రోహాన్ని వివరిస్తాన‌ని ప్ర‌క‌టించారు. అయితే ద‌ళిత జాతికి చెందిన మోత్కుప‌ల్లి ముక్కుసాటి మ‌నిషి.. ఆయ‌న ఒక‌సారి అన్నారంటే అది చేసి తీరుతాడు. అందుకే ఆంధ్ర‌లో ద‌ళిత ఓట్లు ప్ర‌బావితం చేసే నియోజ‌క‌వ‌ర్గాల్లో పాద‌యాత్ర చేసేందుకు సిద్ద‌మ‌వుతున్నాడ‌ట‌.

Mothkupalli narsimhulu expel

అయితే ఈ అవ‌కాశాన్ని త‌మ‌కు అనుకూలంగా ఉప‌యోగించుకునేందుకు చంద్ర‌బాబు ప్ర‌త్య‌ర్థి జ‌గ‌న్ స్కెచ్‌ వేసిన‌ట్లు తెలుస్తోంది. మోత్కుప‌ల్లి యాత్ర కు ఫండింగ్ చేసేందుకు సిద్ద‌మ‌యిన‌ట్లు ప్ర‌చారం అవుతోంది. దీనికి మోత్కుప‌ల్లి ఇంటిద‌గ్గ‌ర జ‌రిగిన సీన్ సాక్ష్యంగా క‌నిపిస్తోంది. వైఎస్ జ‌గ‌న్ రైట్ హ్యా్ండ్‌, వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి .. సోమ‌వారం ( 11.06.2018)మోత్కుప‌ల్లి ఇంటి ముందు ప్ర‌త్య‌క్షం కావ‌టం. టీడీపీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన మోత్కుప‌ల్లి త‌న ఇంటికి వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి వ‌స్తున్న‌ట్లు మీడియాకు స‌మ‌చారం ఇచ్చారు. ఇదేదో సెన్షేష‌న్ వార్త గా భావించిన మీడియా మోత్కుప‌ల్లి ఇంటి ద‌గ్గ‌ర క‌వ‌రేజ్ కోసం వెళ్ళింది. ఇదేది గ‌మ‌నించని విజ‌య సాయి రెడ్డి మోత్కుప‌ల్లి ఇంటికి వ‌చ్చాడు. మీడియాను చూసి అవాక్క‌యిన విజ‌య‌సాయి రెడ్డి కారు దిగ‌కుండానే అక్క‌డినుంచి వెళ్ళిపోయాడు. 

tags: mothupalli narsimhulu, mothkupalli padayatra, telangana tdp, cm chandrababu, ys jagan padayatra shedule, mothkupalli house, mothukapalli narsimhulu cantact number, mothkupalli wicki, cm kcr, ycp mp, ycp mp vijayasai reddy, dhalith constencies in ap, reserved constencies in telangana.

Related Post