దిక్కుతోచని స్థితిలో తెలంగాణ అన్నదాతలు

news02 June 14, 2019, 5:24 p.m. political

Kcr

హైదరాబాద్ : రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తే లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఆ ఉసేత్తడం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా.. రుణమాఫీ విషయంలో ముందడుగు పడటం లేదు. 2018 డిసెంబర్ 11లోపు పంట రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇందుకోసం 6 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించారు. నాలుగు విడతల్లో రుణమాఫీ చేస్తారని వార్తలొచ్చాయి. కానీ రుణమాఫీ విషయంలో ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.

Kcr

అప్పులు తిరిగి కట్టని కారణంగా రైతుల ఖాతాల్లో ఉన్న సొమ్మును తీసుకోవడానికి బ్యాంకర్లు అడ్డుపడుతున్నారు. రైతు బంధు పథకం కింద వచ్చిన సొమ్ములు, ఫించన్ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడినప్పటికీ.. రైతన్నలు వాటిని తీసుకోలేని దుస్థితి. పంట విక్రయించిన తర్వాత వచ్చిన సొమ్ము బ్యాంకు అకౌంట్లో పడటంతో.. వాటిని తీసుకోబోగా బ్యాంకు అధికారులు అడ్డు చెప్పిన ఉదంతాలూ ఉన్నాయి. దీంతో కూలీలకు, పిల్లల చదువులు, బయటి అప్పులు తీర్చడం కోసమని రైతన్నలు బ్యాంకర్లను బతిమాలుకోవాల్సి వచ్చింది. వడ్డీ మొత్తాన్ని బ్యాంకులో ఉంచి మిగతా సొమ్ము తీసుకుంటామంటే గానీ బ్యాంకర్లు కనికరించలేదు. బకాయిలు చెల్లించకపోవడంతో తన ఖాతాను బ్యాంకు అధికారులు స్తంభింపజేస్తున్నారు. వృద్ధ రైతులు ఫించన్ తీసుకోలేని దుస్థితి. సహకార బ్యాంకుల సిబ్బంది రైతుల ఇళ్లలోని తలుపులను తీసుకెళ్లిన ఉదంతాలు కూడా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతోన్న తరుణంలో.. ఇప్పటికైనా సర్కారు స్పందించాలని రైతన్నలు కోరుతున్నారు.

Kcr

2014 నాటితో పోలిస్తే ఈసారి రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య పెరిగింది. రుణమాఫీ మొత్తం లబ్ధిదారుల సంఖ్య 42 లక్షలు దాటింది. 2014లో రుణమాఫీ పొందిన రైతుల సంఖ్య 35.29 లక్షలు కాగా.. ఈ దఫా పెరగడం గమనార్హం. క్రితం సారి ఐదు దశల్లో రుణమాఫీ పూర్తి చేశారు.16 వేల కోట్లకే ఇన్ని ఇబ్బందులు ఎదురైతే.. ఈసారి అంతకు రెట్టింపు మొత్తాన్ని రుణమాఫీ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈసారి ఒకేసారి రుణమాఫీ పూర్తి చేస్తామని ఎన్నికల వేళ కేసీఆర్ మాటిచ్చారు. కానీ నాలుగు దశల్లో మాఫీ చేసే దిశగా యోచిస్తున్నారు. ప్రస్తుత బడ్జెట్లో 6 వేల కోట్లు కేటాయించారు. ఆ నిధుల విడుదల కూడా ముందుకెళ్లడం లేదు. కానీ ఖరీఫ్ సీజన్ మొదలవుతుండటంతో రైతుల పరిస్థితి మాత్రం ఇబ్బందికరంగా తయారవుతోంది.

Kcr

tags: KCR, TELANGANA CM, TELANGANA,RUNAMAFI, BANKS, FARMER'S, TELANGANA GOVERNMENT, SECRETARIAT, CONGRESS,TRS, TELANGANA BHAVAN, GANDHIBHAVAN,UTTAM KUMAR REDDY, REVANTH REDDY

Related Post