కాంగ్రెస్ లోకి భారీగా వలసలు..

news02 Oct. 12, 2018, 9:04 p.m. political

uttam

రానున్నో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసఆర్ ముదనష్టపు పాలన అంతమయ్యే రోజు దగ్గర పడిందని ఆయన చెప్పారు. టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రకాశం హాల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో భూపతి రెడ్డితో పాటు.. 30 మంది ఎంపీటీసీలు, 50 మంది మాజీ సర్పంచులు, వేలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ని సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన పీసిసి చీఫ్ ఉత్తమ్.. ఆయన వెంట వచ్చిన వేలాది మందిని చూస్తోంటే.. ఈ ఎన్నికల్లో నిజామాబాద్ లో 9అసెంబ్లీ సీట్లు గెలుస్తుందని ఖచ్చితంగా నమ్మకం కలుగుతోందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ వి దగుల్భాజీ మాటలని మండిపడ్డ ఉత్తమ్.. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని గొప్పలు చెప్పిన కేసీఆర్, కవితలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

uttam

డిసెంబర్ 12న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పిన ఉత్తమ్.. ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజుల్లో నిజాం షుగర్స్ ను తెరిపిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇంత మంది రైతులు చనిపోతే.. కనీసం ఒక్క రైతు కుటుంబాన్ని కూడా కేసీఆర్ పరామర్శించలేదని ఉత్తమ్ విమర్శించారు. బాంగారు తెలంగాణ అని చెప్పుకున్న కేసీఆర్.. కేవలం బంగారు కుంటుంబాన్ని మాత్రం నిర్మించుకున్నారని మండిపడ్డారు. తెలంగాణలో అనిచివేత పాలన కొనసాగుతోందని చెప్పిన ఉత్తమ్.. టీఆర్ ఎస్ పార్టీని ఇంటికి పంపించి ఘోరీ కట్టాలని అన్నారు. రైతు బంధు పేరిట రైతువకు ఇస్తున్న 4వేల రూపాయలు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిన పీసిసి చీఫ్.. తెలంగాణ వచ్చిన తరువాత ప్రచారం తప్పితే కేసీఆర్ చేసిందేమి లేదని ఫైర్ అయ్యారు. తాము అధికారంలోకి రాగానే ఒకే సారి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
 

tags: uttam, trs leaders joined in congress, trs mlc joined in congress, trs mlc bhupati reddy joined in congress, bhupati reddy joined in congress, mlc bhupati reddy joined in congress, uttam fire on kcr, uttam fire on trs

Related Post