ఉత్తమ్ కోట లో పోటీకి గులాభి అభ్యర్థులు కరువు

news02 June 30, 2019, 12:48 p.m. political

Utham Kumar reddy

అది కాంగ్రెస్ కంచుకోట. . పైగా ఇప్పటి వరకు టిఆర్ఎస్ పార్టీ అకౌంట్ ఓపెన్ చేయని నియోజకవర్గం. అదే పీసీసీ ఛీప్ ఉత్తమ్ వరుసగా గెలిపించిన హుజూర్నగర్ నియోజకవర్గం. నల్గొండ ఎంపీగా ఉత్తమ్ ఎన్నిక కావడంతో ఇప్పుడూ ఆ సీటు ఖాళీ అయ్యింది. రాష్ట్రమంతా తమ హవా ఉందని గులాబీ నేతలు అంటున్నా హుజూర్నగర్ ఉపఎన్నిక విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో హుజూర్నగర్ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ గెలిచింది కాంగ్రెస్ పార్టీయే. 2004లో కోదాడ నుంచి పోటీ చేసిన గెలిచిన ఉత్తంకుమార్ రెడ్డి 2009 ,2014 ,2018 లో లో హుజూర్నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో లో కెసిఆర్ హవా రాష్ట్రం అంతా కనిపించినా హుజూర్నగర్ లో మాత్రం కాంగ్రెస్ జెండా ఎగిరింది. 2018లో కూడా అదే జరిగింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ మహామహులంతా ఓటమిపాలైన హుజూర్నగర్ పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందారు. కేసీఆర్ పథకాలు ఏమీ పని చేయలేదు అందుకే ఇది కాంగ్రెస్ కంచుకోట గా మారింది. 

హుజూర్నగర్ సీటు ఖాళీ కావడంతో ఈ నియోజకవర్గంపై టిఆర్ఎస్ దృష్టిపెట్టింది. ఉత్తమ్ ఖాళీ చేసిన సీటును ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే పోటీ చేసేందుకు అభ్యర్థులు వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఓడిపోయిన కవిత హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ అక్కడి నుంచి పోటీచేస్తే మరోమారు ఓటమి తప్పదేమోనని కవిత వెనకడుగు వేసినట్లు సమాచారం. మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పోటీ చేయించాలని కెసిఆర్ భావిస్తున్న తను హుజూర్ నగర్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా లేనని తెలిపినట్లు తెలుస్తోంది.

హుజూర్నగర్ నుంచి పోటీ చేసేందుకు ఇద్దరు ఎన్నారైలు సైది రెడ్డి అప్పి రెడ్డి లు సిద్ధంగా ఉన్న బలమైన అభ్యర్థులను రంగంలోకి దిగక పోతే ఓడిపోవచ్చు వస్తుందని అంచనా వేస్తున్న కేసీఆర్ వారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదు బలమైన అభ్యర్థి కోసం వెతికే పనిలో ఉన్న కెసిఆర్ ర్ ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తుందో ఒక అంచనాకు రాలేకపోతున్నారు . ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య మాజీ ఎమ్మెల్యే పద్మావతి పోటీలోకి దిగితే ఆ సీట్లో టిఆర్ఎస్ నుంచి ఎవరు నిలబడిన ఓటమి తప్పదని సూర్యా పేట జిల్లాకు చెందిన టిఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది ఫైనల్ కాలేదు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే టిఆర్ఎస్ అభ్యర్థి ఎవరు అనేది తేలుతుంది.

tags: Utham Kumar Reddy, huzurnagar Nagar by-election, nalgonda MP, Telangana by-elections, pragathibavan, congress MP, loksabha election results, Telangana assembly.

Related Post