జనం లేక వెలవెల బోయిన కేసీఆర్ సభ

news02 March 29, 2019, 10:58 p.m. political

​​​​​​Cm kcr plop meeting

హైదరాబాద్ :: కేసీఆర్ కు తెలంగాణ ప్రజల ఎదురు దెబ్బ మొదలైంది. ఇప్పటికే వరస దెబ్బలతో సతమవుతున్న కేసీఆర్ కు.. ఎల్బీ స్టేడియం లో ఏర్పాటు చేసిన మూడు లోక్ సభ నియోజకవర్గాల సమావేశం అట్టర్ ప్లాప్ కావటంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురుగాలి తప్పదా అనే చర్చ మొదలైంది. తెలంగాణ నడిబొడ్డున హైద్రాబాద్ లోనీ లాల్ బహదూర్ స్టేడియం లో టిఆర్ఎస్ ఆర్భాటంగా ఏర్పాటు చేసుకున్న ఎన్నికల ప్రచార సభకు జనం రాకపోవటం తో కేసీఆర్ రాకుండానే అర్ధాంతరంగా సభకు ముగింపు పలికారు.

Cm kcr plop meeting

ఎల్బీ స్టేడియం లో హైదరాబాద్, సికిందరాబాద్ , మల్కాజ్ గిరి, చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం ల పార్లమెంట్ ఎన్నికల సభను నిర్వహించారు. ఈ సభకు మొత్తం 24 నియోజకవర్గాల నుంచి 2 లక్షల మందిని తరలిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు సీఎం కేసీఆర్ ఈ సమావేశానికి రావాల్సి ఉంది. కానీ ఇంటెలిజెన్స్ లెక్కల ప్రకారం ఈ సమావేశానికి 6 వేల మంది వచ్చినట్లు తెలుస్తోంది. సాయంత్రం 7 గంటల కల్లా సభలో పట్టుమని రెండు వేల మంది కూడా లేరు. పట్టుమని పది వేల మంది కూడా రాకపోవడంతో కేసీఆర్ సభకు రాకుండానే మిర్యాలగూడ నుంచి నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లారు.

Cm kcr meeting plop in lb stadium

సారు, కారు 16 అంటున్న టిఆర్ఎస్ నేతలకు వరస దెబ్బలు తగులుతుండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎమ్యెల్సీ ఎన్నికలలో మూడు స్థానాలు కోల్పోయి అడ్రెస్ గల్లంతు చేసుకున్న టిఆర్ఎస్ కు నిజామాబాద్ పార్లమెంట్ లో రైతులు ముకుమ్మడి నామినేషన్లు వేసి అక్కడ కవిత ను ఓడించేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు.. ఇప్పుడు నాలుగు నియోజకవర్గాల మీటింగ్ అటర్ ప్లాప్. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎదురుగాలి తప్పదన్న చర్చ జరుగుతోంది.

Cm kcr meeting failure

tags: Cm kcr meeting fail, lb stadium, TRS loksabha candidates, cm kcr, malla Reddy , TRS meeting, TRS meeting failure, marri Rajashekhar Reddy, Thalasani Srinivas Yadav, ktr meeting.

Related Post