హైదరాబాద్ః సర్వేలు చేయించటంలో కేసీఆర్ దిట్ట. ఇది అందరకి తెలిసిందే. టీఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి ఇప్పటికీ లెక్కలేనన్ని సర్వేలు చేయించారు. కొన్ని ఫలితాలు బయట పెట్టారు. చాలా సర్వేలు ఎవరికి ఇవ్వలేదు. అయితే సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడటంతో మళ్ళీ సర్వేల బాట పట్టారు గులాబీ బాస్. ఈ మధ్యనే ప్రయివేటు సర్వే సంస్థలతో పాటు ఇంటలిజెన్స్ తో క్షేత్రస్థాయిలో సర్వే చేయించారు. ఊరూర తిప్పి ఏ పార్టీ పరిస్థితి ఏంటి.. ఎమ్మెల్యేలపై ప్రజలు ఏమనుకుంటున్నారో సర్వే చేయించారు. అయితే కాంగ్రెస్ పార్టీపై ప్రజలనుంచి వచ్చిన రెస్పాన్స్ తో కేసీఆర్ షాక్ అయ్యారని సమాచారం.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు 22 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ 35 సీట్లతో గెలుపు ప్రారంభమవుతుందని సర్వే ఫలితాల ద్వారా తేలిందట. తారుమారుగా వచ్చిన ఫలితంతో ఆయా నియోజకవర్గాల్లో మళ్ళీ మళ్లీ సర్వేలు చేయించారట. కాని ఫలితం కొద్దిగా అటూ ఇటూ కాంగ్రెస్ బలంగా ఉందని తేలినట్లు తెలిసింది. 2014 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి టీఆ ర్ఎస్ గెలుపుకు ఊతమిచ్చిన ఉత్తర తెలంగాన లో ఈ పార్టీకి ఈ సారి భారీగా షాక్ తగలనుందని సర్వేల ద్వారా తెలిసిందట. ఇక దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంది. అయితే ఈ సారి దక్షిణ తెలంగాణ లో కూడా టీఆర్ ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని టీఆర్ ఎస్ నేతలు చెబుతున్నా.. ఫీల్డ్ లో అలాంటి పరిస్థితి లేదని తేలిందట. దక్షిణ తెలంగాణ లో మొదటినుంచి బలంగా వున్న కాంగ్రెస్ అంతే బలంగా ఉందని తేలిందట. ఇక గ్రేటర్ గహైదరాబాద్ లో మాత్రం ఫలితం మిక్స్డ్ గా ఉందని తేలిందట.
2014 ఎన్నికల్లో తెలంగాణ సాధించిన పార్టీగా పార్టీలకతీతంగా అన్ని పార్టీల కార్యకర్తలు టీఆర్ ఎస్ కే ఓటు వేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. టీఆర్ ఎస్ ప్రభుత్వం పై క్షేత్రస్థాయిలో బలమైన వ్యతిరేకత ఉందని సర్వేల ద్వారా తెలిసిందట. ముందునుంచి కాంగ్రెస్ కు గ్రామగ్రామాన క్యాడర్ ఉంది. పైగా ఉద్యమంలో బాగంగా టీఆర్ ఎస్ కు అటాచ్ అయిన కార్యకర్తలు కూడా అసంతృప్తిగా ఉండటం టీఆర్ ఎస్ కు మైనస్ గా కనిపిస్తోంది. పార్టీ అధిష్టానంమీదతీవ్ర అసంతృప్తితో ఉన్న క్యాడర్ కూడా ఈ సారి టీఆర్ ఎస్ కు హాండ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సర్వే రిజల్ట్ చెబుతోందట. దీంతో టీఆర్ ఎస్ ముఖ్యనేతల్లో కలవరం మొదలయినట్లు తెలుస్తోంది.
35 సీట్లతో మొదలవుతున్న కాంగ్రెస్ రానురాను బలపడే అవకాశాలున్నట్లు క్షేత్ర స్థాయి పరిస్థితులు చెబుతున్పాయి. ఎలాగైన టీఆర్ ఎస్ ను ఓడించాలని గట్టి పట్టుదలతో ఉన్న కాంగ్రెస్... రాష్ట్రంలో ఖాళీ అయిన టీడీపీ క్యాడర్ అంతా ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ బలపడే అవకాశాలు బాగా ఉన్నట్లు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా పదినెలల సమయం ఉంది. దీంతో పొత్తులు.. ఎత్తులతో రాజకీయాలు బాగా మారుతాయనే చర్చ ఉండనే ఉంది. ఇదంతా కాంగ్రెస్ లాభిస్తుందనే చర్చకూడా రాజకీయ వర్గాల్లో ఉంది. 35 సీట్లతో ప్రారంభమవుతున్న కాంగ్రెస్ విన్నింగ్ ... వ్యూహత్మకంగా మరో 25 సీట్లు కనుక సాధిస్తే పరిస్థితి తారుమారుఅవుతుందనే చర్చ టీఆర్ ఎస్ లో జరుగుతోంది.