కేటీఆర్ తీరుతో టీఆర్ఎస్‌కు సోమార‌పు స‌త్య‌నారాయ‌ణ గుడ్ బై

news02 July 9, 2018, 12:07 p.m. political

satyanarayan

పెద్ద‌పల్లి: సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌...ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో టీఆర్ఎస్‌కు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. ఆర్టీసీ ఛైర్మెన్‌, రామ‌గుండం ఎమ్మెల్యే సోమార‌పు స‌త్య‌నారాయ‌ణ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాజ‌కీయాల నుంచి పూర్తిగా త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించి...టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఝ‌ల‌కిచ్చారు. టీఆర్ఎస్ పార్టీలో కంట్రోల్ అనేది లేకుండా పోయింద‌ని...పార్టీలో ఎవ‌రూ చెప్పిన కింది స్థాయి వారు విన‌డం లేద‌న్నారు. ఇలాంటీ ప‌రిస్థితుల్లో రాజ‌కీయాల్లో ఉండ‌డం క‌న్నా...సోష‌ల్ వ‌ర్క‌ర్‌గా ఉండ‌డం మంచిద‌ని పేర్కొన్నారు. 

ramagundam muncipality

సోమార‌పు స‌త్యనారాయ‌ణ‌ తీసుకున్న ఈనిర్ణ‌యం...ఇప్పుడు ఉమ్మ‌డి  కరీంన‌గ‌ర్ జిల్లాలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. రామ‌గుండం మేయ‌ర్ అవిశ్వాసం విష‌యంలో మంత్రి కేటీఆర్ ప్ర‌త్యేక దృష్టి పెట్ట‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్‌ల‌పై ఇచ్చిన అవిశ్వాస నోటీసుల‌ను వెన‌క్కు తీసుకోవాల‌ని ఎమ్మెల్యే స‌త్య‌నారాయ‌ణ‌ను కేటీఆర్ ఆదేశించారు. అధికార పార్టీ మేయ‌ర్‌పై అవిశ్వాసం పెట్ట‌డ‌మేమిట‌ని స‌త్యనార‌య‌ణ‌ను మంద‌లించారు. ఎమ్మెల్యేనే కావాల‌నే త‌న‌కు అనుకూలంగా ఉన్న కార్పొరేట‌ర్ల‌ను పూర‌మాయించి మేయ‌ర్‌పై అవిశ్వాసం ప్ర‌క‌టించడ‌మేమిట‌ని మండిప‌డ్డారు. 

krt

అయితే మంత్రి కేటీఆర్ ఆదేశాల‌తోనే సోమార‌పు స‌త్య‌నారాయ‌ణ తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన‌ట్లు తెలుస్తోంది. అవిశ్వాసంపై మంత్రి ఈస్థాయిలో స్పందించ‌డంపై ఆయ‌న నొచ్చుకున్నారు. ఎమ్మెల్యే,ఆర్టీసీ ఛైర్మెన్ స్థాయిలో ఉన్న న‌న్ను ప‌ట్టించుకోని మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్‌ల‌పై అవిశ్వాసం పెడితే త‌ప్పేంట‌నే భావ‌న‌లో సోమ‌ర‌పు ఉన్నారు. ఈనేప‌థ్యంలోనే మంత్రి కేటీఆర్ కూడా కింది స్థాయి నేత‌ల‌కే బాస‌ట‌గా నిలువ‌డంతో ఆయ‌న‌పై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. 

somarapu with kcr

మ‌రోవైపు స‌త్య‌నారాయ‌ణ మేయ‌ర్‌పై ప్ర‌యోగించిన అవిశ్వాస అస్త్రాన్ని ఉప‌సంహ‌రించుకోమ‌ని కార్పొరేట‌ర్లకు సూచించిన‌ప్ప‌టికీ... వారు స‌సేమీరా అంటున్నారు. ఇందులో కూడా స‌త్య‌నారాయ‌ణ‌దే కీల‌క పాత్ర‌ని తెలుస్తోంది. మేయ‌ర్‌పై అవిశ్వాసం కొన‌సాగించ‌డం ద్వారా ఒక‌వైపు మేయ‌ర్ కూర్చీ లాగేయ‌డంతో పాటు...ప‌రోక్షంగా  వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్‌కు స‌త్య‌నారాయ‌ణ హెచ్చ‌రిక‌లు పంపించారు. అందులో భాగంగానే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించి కేటీఆర్ ఆదేశాన్ని ధిక్క‌రించారు. అంతేకాకుండా గులాబీ నాయ‌క‌త్వం ఆజామాయిషీ ప‌రాకాష్ట‌కు చేరుకుంద‌నే భావ‌న‌ను ప్ర‌జ‌ల‌కు చేర‌వేశారు. దీంతో రాజ‌కీయ‌ల నుంచి సోమార‌పు స‌త్య‌నారాయ‌ణ త‌ప్పుకుంటున్న‌ట్లు చేసిన ప్ర‌క‌ట‌న టీఆర్ఎస్‌కు ఇబ్బందిక‌ర‌మైన అంశామే అంటున్నారు విశ్లేష‌కులు. మొత్తంగా మేయ‌ర్ వ్య‌వ‌హారాన్ని చ‌క్క‌దిద్దుదామ‌ని రామ‌గుండం రాజ‌కీయాల్లో వేలు పెట్టిన కేటీఆర్‌కు చుక్కెదురైంద‌ని చెబుతున్నారు ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు. 

 

tags: somarapu satyanarayan gud bye to trs,ramagunda mla, mla somarapu satyanarayan,satyanaraya,rtc chairmen,rtc,ramagunda corporation,ktr,minister ktr, ktr fire on ramagundam mla,mayorm,deputy mayor,minister ktr,minister ktr twitter,minister ktr biography,minister ktr whatsapp number,minister ktr phone number,minister ktr email id,minister ktr address,minister ktr family photos,minister ktr wife,minister ktr profile,minister ktr car,minister ktr age,ktr ,inister appointment,telangana minister ktr address,minister ktr office address,minister ktr birthday,minister ktr contact number,minister ktr contact details,ktr minister contact,minister ktr education,ktr minister email,telangana minister ktr email id,minister ktr family,ktr minister for,,it minister ktr facebook,honorable minister ktr ktr minister in telangana,ktr it minister,ktr it minister contact number,it minister ktr profile,it minister ktr speech it minister ktr number,it minister ktr office address,it minister ktr,it minister ktr p

Related Post