ఒకే వేధికపై రాహూల్-చంద్రబాబు

news02 Oct. 12, 2018, 8:05 a.m. political

rahul

త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమన్న సర్వే రిపోర్టుల నేపధ్యంలో ఏఐసిసి అధ్యక్షులు రాహూల్ గాంధీ దూకుడు పెంచారు. రాజస్తాన్, మద్యప్రదేశ్, చత్తీస్ గఢ్, మిజోరాం తో పాటు.. తెలంగాణపైనా ప్రత్యేక దృష్టి సారించారు రాహూల్. ఈమేరకు తెలంగాణలో అవకాశం మేరకు ప్రచారం నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. ఈనెలాఖరున తెలంంగాణలో ప్రచారానికి రాహూల్ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 20న కామారెడ్డి, బోధన్ లో జరిగే భహిరంగ సభల్లో రాహూల్ గాంధీ పాల్గొననున్నారు. ఇక ఈ నెల 27న రెండో విడతలో కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో జరిగే పార్టీ భహిరంగ సభల్లో రాహూల్ పాల్గొంటారు. ఈనెల 27న రాత్రి జరిగే తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలో ను రాహూల్ పాల్గొననున్నారు.

uttam

ఇక ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకున్న నేపధ్యంలో రెండు పార్టీల క్యాడర్ లో మంచి జోష్ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఏఐసిసి అధ్యక్షులు, టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి ప్రచారం చేసే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ కుదిరితే నవంబర్ లో హైదరాబాద్ లో జరిగే భహిరంగ సభలో రాహూల్ గాంధీ, చంద్రబాబు నాయుడు ఇద్దరూ పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరిద్దరు కవిసి ప్రచారంలో పాల్గొంటే క్యాడర్ లో ఉత్సాహం రెట్టింపు అవుతుందని నేతలు చెబుతున్నారు. ఈ మేరకు రాహూల్ గాంధీ, చంద్రబాబు ల డేట్లు కుదిరేలా భహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
 

tags: rahul, rahul gandhi, raul tour in telangana, rahul election campaign in telangana, rahul chandra babu election campaign, chandra babu rahul election campaign

Related Post