సస్పెన్షన్ కు కారణం చెప్పండి..కాంగ్రెస్ నేతల డిమాండ్

news02 March 13, 2018, 11:54 a.m. political

అసెంబ్లీలో  సోమవారం జరిగిన పరిణామాల నేపథ్యంలో 11 మంది కాంగ్రెస్ సభ్యులను ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. అలాగే మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై హెడ్‌ఫోన్‌ విసిరి గాయపర్చారంటూ  కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌‌ల శాసనసభ సభ్యత్వాలను రద్దు చేశారు. జానారెడ్డి, జీవన్‌రెడ్డి, గీతా‌రెడ్డి, చిన్నారెడ్డి, ఉత్తమ్‌కుమార్, డి.కె.అరుణ, మల్లు భట్టి విక్రమార్క, పద్మావతిరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, వంశీచందర్‌రెడ్డి, మాధవరెడ్డిలను సస్పెండ్ చేయాలంటూ మంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టిన తీర్మానానికి స్పీకర్ మధుసూదనాచారి ఆమోదం తెలిపారు.

అటు శాసనమండిలోనూ బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకు మండలి నుంచి షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సంతోష్, దామోదర్‌రెడ్డి, ఆకుల లలిత, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి లను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అసలు ఎందుకు సస్పెండ్ చేశారో కారణాలు చెప్పాలేదని షబ్బీర్ అలీ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇవాళ బ్లాక్ డే అని విమర్శించారు.

మరోవైపు మండలి చైర్మన్ స్వామిగౌడ్ కు హెడ్ ఫోన్స్ తగిలే అవకాశం లేదంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి..దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ప్రభుత్వం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కన్నుకు చెయ్యి కూడా స్వామిగౌడ్ అడ్డుపెట్టుకోలేదని, డైరెక్ట్‌గా హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారని జీవన్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యల్ని పట్టించుకోలేదన్న ఆవేదనలో గవర్నర్ ప్రసంగానికి నిరసన తెలిపామని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

 

tags: congress, trs, suspenssion, assembly, mla, mlc, assembly

Related Post