హెలికాఫ్టర్ నుంచి చూసి చిన్నబుచ్చుకున్న కేసీఆర్

news02 Sept. 3, 2018, 9:40 a.m. political

Cm kcr helicafter

హైదరాబాద్ : ఏదో చేద్దామనుకుంటే ఏదో అయింది. ప్రగతి నివేదన సభతో తన బలం ఏంటో చూపించాలని భావించిన కేసీఆర్ కు గట్టి షాక్ తగిలింది. 25 లక్షల మందిని తరలించి ప్రతిపక్షాలకు సవాల్ విసరాలని కేసీఆర్ భావిస్తే జనం లేక ఆయన మూడ్ అఫ్ కావాల్సి వచ్చింది. ఇంత ఖర్చు పెట్టి సభ నిర్వహిస్తే అటు ఇటుగా మూడున్నర లక్షల మాత్రమే సభకు వచ్చారు. అనుకున్నంత జనం రాకపోవటం తో వేదికపై ఉన్నంతసేపు కేసీఆర్ అసహనంతో కనిపించారు. 

TRS Pragati nivedana Sabha

సాయంత్రం 6 గంటలకు సభావేదిక వద్దకు చేరుకున్న కేసీఆర్ హెలికేఫ్టర్ లోనే రెండు చక్కర్లు కొట్టారు. పై నుంచి కింద జనాలను చూస్తూ తిరిగారు. 25 లక్షల మంది వస్తారని పిలుపు ఇచ్చినా.. కనీసం పది లక్షల మంది సభకు వస్తారని కెసిఆర్ భావించారు. ప్రగతి భవన్ లో జరిగిన కేబినెట్ మీటింగ్ లో మంత్రిలను పిలిచి ఎంత మంది జనం వస్తారని అడిగినట్లు తెలుస్తోంది. ఒక్కొక్క మంత్రి తమ జిల్లా ల నుంచి లక్ష నుంచి లక్షన్నర జనం వస్తారని సమాధానం చెప్పినట్లు సమాచారం. జనాలను తరలించేందుకు ఒక్కొక్క ఎమ్మెల్యేకు కోటి రూపాయలు, మాజీ ఎమ్మెల్యేలకు జిల్లా నేతలకు 25 లక్షలు ఇచ్చినట్లు సమాచారం. వచ్చిన జనాభా ను పట్టి చూస్తే పాత జిల్లాల వారీగా ఒక జిల్లా నుంచి 35 వేల మంది వచ్చినట్లు తెలుస్తోంది. 31 కొత్త జిల్లాల వారీగా చూస్తే ఒక్కొక్క జిల్లా నుంచి 3 వేల మంది హాజరయ్యారు. 

TRS Pragati nivedana Sabha

సభా వేదికపై సీఎం కేసీఆర్ కొత్త వరాలు ప్రకటిస్తారని ఎన్నికల అంశం పై ఏదో ఒకటి తేలుస్తారని అందరూ ఆశించారు. కానీ మూ డ్ ఆఫ్ లో వున్న కెసిఆర్ పేలవంగా మాట్లాడారు. వేదికపై కేసిఆర్ మాట్లాడుతుండగా ప్రజల నుంచి స్పందన రాలేదు. కేసీఆర్ అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. ప్రజలంతా తమ వెంటే ఉన్నారు వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు సాధిస్తామని చెప్తున్న కేసీఆర్ కు అసలు విషయం అర్థం అయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటివరకు తనకు ఎదురు లేదని భావిస్తున్న కెసిఆర్ కు గ్రౌండ్ లో ఏం జరుగుతుందో అర్థమైంది. కెసిఆర్ ప్రభుత్వంపై ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో ఈ సభ అద్దం పట్టింది అని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. డబ్బులు ఇస్తే ఏసభకైనా జనం వస్తానని టీఆర్ఎస్ నేతలు భావించినా తాము డబ్బులు ఇచ్చినా జనం రాకపోవడం పై గులాబీ నేతలు మదన పడుతున్నారు.

Delhi Vidhan Sabha

ప్రగతినివేదన సభలో తన బలం ఏంటో తెలుసుకున్న కేసీఆర్ ముందస్తు ఎన్నికల .. అంతే స్పీడ్ కొనసాగిస్తారా వెనక్కి తగ్గుతారా అన్న చర్చ టీఆర్ఎస్ లోనే జరుగుతుంది రానురాను వ్యతిరేకత పెరుగుతుంది కాబట్టి ఇప్పుడే ఎన్నికలకు వెళ్తారా లేక కొంత సమయం తీసుకొని షెడ్యూల్ ప్రకారం కి వెళ్తారా అన్న చర్చ జరుగుతుంది.

tags: KCR helicopter, Telangana CM KCR, Pragati nivedana Sabha kongara Kalan, kongara Kalan TRS meeting, kongara Kalan meeting, outer ring road traffic jam, CM KCR meeting, TRS public meeting, KCR Historical meeting, Minister KTR kongara Kalan, MP Kavitha kongara Kalan, public meeting TRS, CM KCR full speech in Pragati nivedana Sabha, CM KCR Speech in kongara Kalan meeting, CM KCR visit kongara Kalan, CM KCR aerial review, CM KCR helicopter travelling.

Related Post