భారీ మెజార్టీతో గెలవబోతున్న మహాకూటమి..

news02 Nov. 9, 2018, 6:41 p.m. political

mahakutami

తెలంగాణలో మహాకూటమే అధికారంలోకి రాబోతోందా.. మహాకూటమికి ఈ ఎన్నికల్లో బంపర్ మెజార్టీ రానుందా.. అంటే అవునే సమాధానం వస్తోంది. 2014 లో జరిగిన ఎన్నికల సరళిని పరిశీలిస్తే.. ఈ ఎన్నికల్లో మహాకూటమి భారీ విజయం సొంతం చేసుకోనుందని చెప్పవచ్చు. 2014 ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ పెద్ద మోజార్టీతో ఏం గెలవలేదు. అత్తెసరు ఓట్లతో గెలిచిన టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చింది. అంటే 2014 ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు కేవలం 34శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఓట్లతోనే 63 సీట్లను గెలుచుకుంది టీఆర్ ఎస్ పార్టీ. అంటే 34 శాతం ఓట్లతో 53 శాతం సీట్లను గెలిచింది టీఆర్ ఎస్. 

mahakutami

ఇక అదే మిగతా పార్టీల సంగతి చూస్తే.. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ-బీజేపీ కూటమి విడివిగా పోటీ చేశాయి. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పార్టీలన్నింటికి కలిపి 40.46 శాతం ఓట్లు వచ్చాయి. అంటే ఈ లెక్కన 2014 ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ కంటే కూడా కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పార్టీలకు 6.42 శాతం ఓట్లు అధికంగా వచ్చాయన్నమాట. మరిప్పుడు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పార్టీలకు తోడు జనసేన పార్టీ కూడా కలిసింది. ఈ క్రమంలో గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన పార్టీలన్నీ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి.. ఖచ్చితంగా 40 శాతానికి మించి ఓట్లు వస్తాయని గంటాపధంగా చెప్పవచ్చు. గత ఎన్నికల్లో కేవలం 34శాతం ఓట్లకే టీఆర్ ఎస్ పార్టీ 63 సీట్లు గెలుచుకుంది కాబట్టి.. ఈ ఎన్నికల్లో మహాకూటమికి 40.46 శాతం ఓట్లు వస్తే ఇంకేముంది కనీసం 75కు పైగానే సీట్లు వస్తాయని తెలుస్తోంది. 

mahakutami

అంతే కాదు ఏ పార్టీ అయినా వరుసుగా రెండో సారి గెలిచినప్పుడు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగా ఓట్ల శాతం తగ్గుతూ వస్తుంది. ఇది గతంలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో 1994లో టీడీపీీీీ గెలిచినప్పటికీ.. మళ్లీ 1999లో ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చినా.. 5శాతం ఓట్లు తగ్గిపోయాయి. ఆ తరువాత కాంగ్రెస్ హయాంలోను.. 2004లో గెలిచినా.. 2009లో రెండోసారి గెలిచినప్పుడు 2శాతం ఓట్లు తగ్గాయి. ఈ లెక్కన టీఆర్ ఎస్ కు ఈ ఎన్నికల్లో కేవలం రెండు శాతం ఓట్లు తగ్గుతాయని అనుకున్నా.. ఓట్ల శాతం 32కు పడిపోతుందని చెప్పవచ్చు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే.. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మహాకూటమి భారీ మెజార్టీతో గెలవనుందని ఎవరైనా చెప్పేస్తారు.

tags: mahakutami, mahakutami will win in telangana, mahakutami will win, mahakutami will success in telangana, mahakutami will gain 75 seats

Related Post