వ‌చ్చేది కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే..

news02 July 12, 2018, 6:22 p.m. political

uttam kumar reddy, face book live, pre elections, congress

హైద‌రాబాద్ : స‌ర్వే రిపోర్ట్ లు అన్ని కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయి.. వ‌చ్చేది మ‌న ప్ర‌భుత్వమే.. ఎన్నిక‌ల‌కు సిద్దం కండి అని పార్టీ క్యాడ‌ర్ కు పిలుపునిచ్చారు పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. రాజ‌కీయ ప‌రిణామాలు చూస్తుంటే.. ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చేలా ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు. గాందిభ‌వ‌న్ లో ఫేస్ బుక్ లైవ్ లో పార్టీ కార్య‌క‌ర్త‌లు, నేత‌ల‌తో మాట్లాడిన ఉత్త‌మ్  క్యాడ‌ర్ దిశా నిర్దేశం చేశారు.

uttam kumar reddy, facebook, live, gandhibhavan, congress

పంచాయితీ ఎన్నిక‌ల రిజ‌ర్వేష‌న్ ల‌లో ప్ర‌భుత్వం చేసిన త‌ప్పిదాల‌ను కేసీఆర్ , కాంగ్రెస్ పై నెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారని మండిప‌డ్డారు ఉత్త‌మ్. పంచాయితి ఎన్నిక‌ల్లో బీసీల‌కు న్యాయం జ‌ర‌గాల‌న్న‌దే కాంగ్రెస్ అభిమ‌త‌మ‌న్నారు. కోర్ట్ కేసుల‌కు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేద‌న్న ఉత్త‌మ్.. బిసిల‌కు జ‌నాభా ప్రాతిపాధిక‌న రిజ‌ర్వేష‌న్ లు క‌ల్పించి పంచాయ‌తి ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేశారు.

tpcc cheief uttam kumar reddy on kcr governament, farmers issues, congress

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో మోడి, కేసీఆర్ ల‌కు రైతుల‌పై ప్రేమ పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేశారు ఉత్త‌మ్. నాలుగేళ్లు రైతుల‌ను ప‌ట్టించుకోని మోడి, కేసీఆర్ లు.. ఇప్పుడు మ‌ద్ద‌తు ధ‌ర‌, పెట్టుబ‌డి స‌హాయం అంటు గొప్ప‌లు చేప్పుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. వ‌చ్చే కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మార్కెట్ కు వ‌చ్చే ప్ర‌తి గింజ‌కు మ‌ద్ద‌తు ద‌ర‌కు అద‌నంగా బోన‌స్ ఇచ్చి ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేస్తుంద‌ని తెలిపారు. అంతేకాదు అధికారంలోకి వ‌చ్చిన వంద రోజుల్లో రైతుల‌కు రెండు ల‌క్ష‌ల రుణ‌మాఫీని ఏక‌కాలంలో అమ‌లు చేస్తామ‌న్నారు.  క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకోచ్చి.. భీమా కూడా ప్ర‌భుత్వ‌మే బ‌రిస్తుంద‌ని తెలిపారు ఉత్త‌మ్. ఫేస్ బుక్ లైవ్ అనంత‌రం LDMRC 31 నియోజక వర్గాలకు చెందిన ఏరియా బూత్ కో ఆర్డినెటర్స్, మండల, జిల్లాల అధ్యక్షులతో టేెలికన్ఫరెన్సు లో మాట్లాడారు ఉత్తమ్ కుమార్ రెడ్డి

tags: tpcc uttam kumar reddy, gandhibhavan, farmers,uttam on modi, kcr, farmers lones, pre-elections, telangana, uttam face book live, ldmrc meeting

Related Post