సీఎం కేసీఆర్ కు స్టాలిన్ షాక్

news02 May 13, 2019, 9:15 p.m. political

Cm kcr met DMK stalin

చెన్నై : చెన్నై టూర్ సీఎం కేసీఆర్ కు నిరాశను మిగిలించింది. తన ఫెడరల్ ఫ్రంట్ లోకి Dmk ను ఆహ్వానించాలని కేసీఆర్ ప్రయత్నం చేస్తే.. కాంగ్రెస్ కు మద్దతుగా కలిసి రావాలని స్టాలిన్ రివర్స్ స్టోరీ చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్ సమావేశంలో తాజా రాజకీయాలపై ఇద్దరూ దాదాపు గంట సేపు చర్చించారు. సమావేశం తర్వాత కేసీఆర్, స్టాలిన్ ఇద్దరూ మీడియాతో మాట్లాడకుందనే వెళ్లిపోయారు. 

లోక్ సభ ఎన్నికలు, ఫలితాలు.. ఆతర్వాత జరిగే పరిణామాల పై.. అమలు చేయాల్సిన రాజకీయ వ్యూహాలపై స్టాలిన్, కేసీఆర్ చర్చించినట్లు డీఎంకే నేతలు చెప్పారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలు… కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా పోటీ చేశాయనీ…  ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఫెడరల్ ఫ్రంట్ గా ఏర్పాటయ్యేందుకు డీఎంకే ముందుకు రావాలని కేసీఆర్ ఆహ్వానించినట్టుగా చెప్పారు.

Cm kcr met DMK stalin

కేసీఆర్ చెప్పిన దంతా విన్న స్టాలిన్.. తమ వర్షన్ కూడా వివరించారు. కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయం తీసుకురావడమే తమ లక్ష్యం గా స్టాలిన్ వివరించారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా తమ పార్టీ డీఎంకేనే ప్రపోజ్ చేసింది కాబట్టి… కాంగ్రెస్ నుంచి వేరుగా విడి పోయి.. వేరే ఫ్రంట్ లకు మద్దతు తెలిపేదే లేదని తేల్చి చెప్పారు. వీలుంటే మీరూ కూడా కాంగ్రెస్ తోనే జతకలవండి అంటూ తన అభిప్రాయాన్ని స్టాలిన్ కేసీఆర్ కు చెప్పినట్టుగా DMK నేతలు తెలిపారు.ఫెడరల్ ఫ్రంట్ అజెండాను కేసీఆర్ వివరించినప్పటికీ.. అందుకు స్టాలిన్ నుంచి సానుకూల స్పందన రాలేదని డీఎంకే తెలిపింది. ఈమేరకు డీఎంకే నేతలు ట్విట్టర్ లో పేర్కొన్నారు.

tags: Cm kcr, kcr , Ktr, Mp Kavitha, Harish Rao, TRS Harish Rao, Harish Rao latest photos, TRS chief kcr latest address , Telangana cm home, Telangana next cm Ktr, Telangana TRS, Telangana political parties, federal front, cm kcr front, on kcr, DMK Stalin, cm kcr met Stalin, cm kcr Chennai tour, pm Rahul Gandhi, UPA pm candidate, NDA pm candidate, pm Modi.

Related Post