ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే

news02 May 4, 2019, 9:07 p.m. political

rahul

ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని ఆయన చెప్పారు. మోదీ అనాలోచితంగా తెచ్చిన జీఎస్టీ వల్ల దేశంలోని లక్షలాది చిన్న వ్యాపార సంస్థలు కుదేలయ్యాయని రాహూల్ మండిపడ్డారు. నోట్ల రద్దు లాంటి తప్పుడు నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడిందని విమర్శించారు. అధికారంలోకి రాగానే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన మోదీ ఆ తరువాత ఊసే ఎత్తలేదని రాహూల్ గాంధీ ఫైర్ అయ్యారు. ఉద్యోగాల విషయంలో ప్రధాని మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని రాహూల్ ప్రశ్నించారు. అవినీతి, నిరుద్యోగం, రైతాంగ సంక్షోభంపై చర్చించడానికి కేవలం 10 నిమిషాలు కేటాయించాలని మోదీకి సవాల్ విసిరిన రాహూల్.. అందుకు అనిల్‌ అంబానీ ఇంట్లో కాకుండా వేదిక ఎక్కడ ఏర్పాటు చేసినా తాను సిద్ధమేనని వ్యాఖ్యానించారు. 

rahul

దేశంలోని త్రివిధ దళాలు తన సొంత ఆస్తులు కాదన్న విషయాన్ని నరేంద్ర మోదీ గుర్తుంచుకోవాలని హితువి పలికారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన మెరుపు దాడుల్ని మోదీ.. వీడియో గేమ్స్‌గా అభివర్ణించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన రాహూల్.. ఇది సైన్యాన్ని అవమానించడమేనన్నారు. చౌకీదార్‌ ఛోర్‌ హై అన్న నినాదం కొనసాగుతుందని చెప్పిన రాహూల్.. అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్‌ అజార్‌పై మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రైతులను సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ప్రత్యేక పథకాలు రూపొందించామని చెప్పారు. నరేంద్ర మోదీ హయాంలో కుదేలైన దేశ ఆర్థిక రంగం.. తాను ప్రవేశపెట్టబోయే కనీస ఆదాయ పథకం న్యాయ్‌ తో ఊపందుకుంటుందని రాహూల్ గాంధీ చెప్పుకొచ్చారు.

tags: rahul, rahul gandhi, rahul fire on modi, rahul gandhi fire on modi, rahul fire on pm modi, rahul gandhi fire on pm modi, rahul about modi, rahul gandhi about pm modi

Related Post