కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి..

news02 Oct. 30, 2018, 4:08 p.m. political

ramulu

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ పార్టీకి వంద సీట్లు వస్తాయని కేసీఆర్‌ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాములు నాయక్ విమర్శించారు.  కారు బ్రేకులు ఫెయిలయ్యాయన్న ఆయన..  టైర్లు పంక్చర్‌ అయ్యాయని ఎద్దేవా చేశారు. ఇక కారు స్టీరింగ్‌ కాంగ్రెస్‌ చేతుల్లోకి వెళ్లిపోయిందని తనదైన స్టైల్లో సెటైర్ వేశారు. డిసెంబర్‌ 11 తర్వాత ప్రగతిభవన్‌ మహాకూటమిదే రాములు నాయక్ ధీమా వ్యక్తం చేశారు. సీమాంధ్రులను ఓవైపు కేసీఆర్‌ తిడతారని, మరోవైపు కేటీఆర్‌ బుజ్జగిస్తారని మండిపడ్డారు. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలో టీఆర్‌ఎస్‌ గెలిస్తే తాను చెప్పు నెత్తిన పెట్టుకుంటానని రాములూ నాయక్ సవాల్ విసిరారు. అంతే కాదు కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావడం కలగానే మిగులుతుందని నాయక్ ఎద్దేవా చేశారు.

kcr

ఇక ఈ ఎన్నికలపై తాను మూడు జిల్లాల్లో సర్వే చేయించానని చెప్పిన రాములు నాయక్.. మెదక్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లో మహాకూటమి మెజార్టీ సీట్లు గెలుస్తుందని చెప్పారు. ఆపధ్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ది రాత్రిపూట చేసే గ్లాస్‌ సర్వే అని.. తనది గ్రాఫ్‌ సర్వే అని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణలో డాక్టర్లు లేరని కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లారన్న రాములు నాయక్ కేసీఆర్‌ కు వైద్యం చేసే డాక్టర్‌ నరేంద్రమోదేనని వ్యాఖ్యానించారు. రాములూ నాయక్ ఇటీవలే టీఆర్ ఎస్ పార్టీ నుంచి రాహూల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

 

tags: kcr, ramulu naik, ramulu naik fire on kcr, ramulu naik fire on trs, ramulu naik about kcr, ramulu naik about trs

Related Post