ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తాం

news02 June 22, 2018, 10:20 a.m. political

 

Utham Kumar Reddy as a PCC chiefహైదరాబాద్ : పిసిసి చీఫ్ ఉత్తమ్ ను దింపేందుకు కొందరు నేతలు చేస్తున్న ప్రయత్నాలకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి కుంతియ బ్రేక్ వేశారు. తెలంగాణ పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోనే సార్వత్రిక ఎన్నికలకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. ఉత్తమ్ లేకుండా కొద్దిమంది నేతలు ఢిల్లీ కి వెళ్లి రాహుల్ గాంధీ ని కలవటం పై క్లారిటీ ఇచ్చారు. రాహుల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడానికి కలిస్తే ,ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన పిర్యాదు చేయడానికి వెళ్లారు అని మీడియాలో వచ్చి న వార్త అవాస్తవమని చెప్పారు."ఉత్తంకుమార్ రెడ్డి యే పీసీసీ ప్రెసిడెంట్ గా కొనసాగుతారు,ఉత్తమ్ ఆధ్వర్యంలో నే మేము ఎన్నికలకు వెళతాం" అని కుంతియా స్పష్టం చేశారు. 

కేసీఆర్సర్కారు ఇరిగేషన్ లో చేస్తున్న అవినీతి పై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంద ని కుంతియ స్పష్టం చేశారు. గిరిజనుల భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వం పై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందనీ స్పష్టం చేశారు. కేసీఆర్ ,టీఆరెస్ కు వ్యతిరేఖంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంద ని తెలిపారు. దళితుల,గిరిజనుల, మైనారిటీల ,బీసీ ,అన్ని వర్గాల హక్కుల కోసం కేసీఆర్ కు వ్యతిరేఖంగా పోరాడుతామ ని స్పష్టం చేశారు.

ఉత్తమ్ఉకుమార్ రెడ్డి

 

గాంధీ భవన్ లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పార్టీలో యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల్సిన పనులను చర్చించినట్లు తెలిపారు.శక్తి యాప్ కిందనే భూత్ లెవెల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జూన్ 30 లాస్ట్ డేట్ గా నిర్ణయించినట్లు తెలిపారు.తెలంగాణ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నియామకాలపై చర్చ జరిగినట్లు తెలిపారు. అయితే ఇంకా నిర్ణయం తీసుకోలేద ని స్పష్టం చేశారు.

tags: Utham Kumar Reddy, tpcc chief, Telangana Congress, Telangana Congress incharge, rc kunthiya, Rahul Gandhi, Soniya Gandhi, gandhibavan, dkn aruna, Congress groups, cm KCR, KCR target, 2019 elections, Congress results.

Related Post