ఎక్కడో మునిగి.. ఎక్కడో తేలి

news02 May 17, 2018, 7:56 p.m. political

Karnataka mla R.shankar

బెంగుళూరు : కర్ణాటకలో బలం లేకున్నా యెడ్యూరప్ప ప్రభుత్వం ఏర్పాటు కావటంతో ఇక ఎమ్మెల్యేల బేర సారాలు జరగటం అనేది ఓపెన్ సీక్రెట్ అయ్యింది. ఏ ఎమ్మెల్యే ఎక్కడ జారుకుంటాడో..ఏ ఎమ్మెల్యే ఎక్కడ కనిపిస్తాడో ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఇప్పటికే రిసార్ట్స్ లో క్యాంప్ రాజకీయాలు మొదలు పెట్టారు. అయితే కన్నడ నెంబర్ గేమ్ లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కీలకమయ్యారు.

Karnataka mla.R. shankarమొత్తం ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు గెలిచారు. ఇందులో ఒకరు ఓపెన్ గా కాంగ్రెస్ కు మద్దతిచ్చారు. హీరో ఉపేంద్ర స్థాపించిన కర్నాటక ప్రజ్ఞావంతా జనతా పార్టీ పై గెలిచిన ఆర్ .శంకర్ మాత్రం ఎక్కడో మునిగి ఎక్కడో తేలుతున్నాడు. ఆర్. శంకర్. బుధవారం ఉదయం బీజేపీకి సపోర్ట్ గా గవర్నర్ ను కలిసాడు.

Mla r.shankar with congress

బుధవారం సాయంత్రం కా‍ంగ్రెస్, జేడీఎస్ కూటమికి మద్దతు ప్రకటించాడు.బుధవారం రాత్రి బీజేపీ కార్యాలయానికి వెళ్ళి బీజేపీకి మద్దతు ప్రకటించాడు. గురువారం ఉదయం యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి చేపట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, జేడీఎస్ నిరసనలో పాల్గొన్నారు.ఒక్క ఎమ్మెల్యేకు 100 కోట్ల ఆఫర్ వచ్చిందని వార్తలు వస్తున్న తరుణంలో ఆర్. శంకర్ కు బేరం ఇంకా కుదరలేదా అని నేటిజెన్లు సెటైర్లు వేస్తున్నారు.

Related Post