కేటీఆర్ సన్యాసానికి సిద్ధం అవ్వు

news02 April 6, 2018, 7:56 p.m. political

Utham challenge to ktr

పరకాల : మంత్రి కేటీఆర్ సవాలును పిసిసి చీఫ్ ఉత్తమ్ స్వీకరించారు. వచ్చే ఎన్నికల్లో అధికారం లోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. కాంగ్రెస్ అధికారం లోకి రాకపోతే ఉత్తమ్ అన్న సన్యాసానికి సిద్ధమా అని గురువారం మిర్యాలగూడ లో జరిగిన ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. అయితే పరకాలలో జరిగిన ప్రజా చైతన్య సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కేటీఆర్ సవాల్ ను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావడం.. ఖాయం.. కాంగ్రెస్ ప్రభంజనం వీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఉత్తమ్ అన్నారు.

Parakala congress bus yatra

రాష్ట్రంలోఅవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది.. అరాచకాలు పెరిగాయి, కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఉత్తమ్ అన్నారు. పోలీసులు తమ కార్యకర్తలను వేధిస్తే ప్రతీకారం తప్పదని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు అభయ హస్తం పెన్షన్లను 1000 రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. 6 లక్షల మహిళా సంఘాలకు 70 లక్షల మహిళలకు ఆర్థికంగా ప్రోత్సకాలు,6 లక్షల మహిళ సంఘాలకు ప్రతి సంఘానికి వడ్డీ భారం లేని 10 లక్షల రుణం ఇస్తామన్నారు.

Congress bus yatra warangal

రైతులకు కేసీఆర్ పాలనలో దుక్కమే మిగిలింది.. బంగారు తెలంగాణ అంటున్నారు..కేవలం బంగారు కుటుంబమే అయిందన్న ఉత్తమ్ 4 కోట్ల మంది చస్తుంటే 4 గురే బాగుపడుతున్నారు.. ఎన్నికలు వస్తున్నాయనే వేల పథకాన్ని మొదలు పెడుతున్నారని అన్నారు. ఇప్పటిదాకా ఇవ్వని ఈ పథకం ఇప్పుడు ఎందుకు.. ఓట్ల కోసమే కాదా అని ప్రశ్నించారు.కాంగ్రెస్ పాలనలో రైతు రుణ మాఫీ ఏకాలంలో 2 లక్షలు ఏక కాలంలో చేస్తామని హామీ ఇచ్చారు. పంటలకు గిట్టుబాటు ధరల కల్పించి రైతులను అడుకుంటాము.. వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి, పసుపు ధరలు పెంచుతాము.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగాల కల్పన చేసి.. ఖాళీలు భర్తీ చేస్తామని తెలిపారు. నెలకు 3 వేల నిిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు ఉత్తమ్

tags: Congress bus yatra, pcc chief, parakala, utham bus tour, challenge, samayam, sanyasam, ktr.

Related Post